Viral News: ‘నా భర్త మంచోడే..’.. ఫోక్ సాంగ్స్ ఆర్టిస్టులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య..

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: జానపద పాటలు (Folk Songs) ద్వారా గుర్తింపు పొందిన నటీనటులు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ల వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. ఇటీవల ‘ప్రమీల’ ఫోక్ సాంగ్లో ప్రధాన నటీనటులుగా నటించిన వీరిద్దరినీ నిన్న అర్ధరాత్రి సమయంలో ఈశ్వర్ సాయి భార్య రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. తన కళ్లముందే ఉంటూ తన భర్తను లోబరుచుకుందని మాధురి రాథోడ్పై భార్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

తన భర్త ఏ తప్పూ చేయలేదని, అతడిని మాధురి రాథోడే మాయమాటలతో లొంగదీసుకుందని బాధితురాలు ఆరోపించారు.

భర్త మంచోడే: “మాకు పెళ్లయి 7 ఏళ్లు అవుతోంది. నా భర్త కనీసం మందు కూడా తాగని మంచి వ్యక్తి. ఆమెనే నా భర్తపై పడి లొంగదీసుకుంది. ఆడదే మీద పడితే పురుషుడు మాత్రం ఏం చేస్తాడు?” అని ప్రశ్నించారు.

నమ్మి మోసపోయాను: “ఈ అమ్మాయికి గతంలో బ్రేకప్ అయితే నేనే దగ్గరుండి ఓదార్చాను. నా పక్కనే ఉంటూ, మంచి అమ్మాయిలా నటిస్తూ నన్నే మోసం చేస్తుందని అనుకోలేదు. వారిద్దరి మధ్య ఉన్న వాట్సాప్ మెసేజ్లు చూసి షాక్ అయ్యాను.”

ఆత్మహత్యాయత్నం: ఈ ద్రోహం తట్టుకోలేక ఒకానొక దశలో తన కొడుకుతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నట్లు భార్య కన్నీటిపర్యంతమయ్యారు.

పరిశ్రమకు విజ్ఞప్తి: ఇలాంటి ప్రవర్తన కలిగిన అమ్మాయిలను ఫోక్ సాంగ్స్ పరిశ్రమలోకి రానివ్వకూడదని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సోషల్ మీడియాలో ఎంతో ప్రాచుర్యం పొందిన జానపద కళాకారులు ఇలా వివాదంలో చిక్కుకోవడం, భార్య స్వయంగా రంగంలోకి దిగి రచ్చకెక్కడం యూట్యూబ్, ఫోక్ సాంగ్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.

Share
Share