Breaking News: ‘యాక్సిడెంట్ చేసి నా భర్తను చంపు, లేదంటే నేను చస్తా’.. కొరియర్ బాయ్‌తో భార్య చాటింగ్..

ఖమ్మం/డోర్నకల్లు, ఏపీబీ న్యూస్: పచ్చని సంసారంలో కొరియర్ బాయ్ తెచ్చిన వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది. కట్టుకున్న భర్తను ఎలాగైనా మట్టుబెట్టాలని, అందుకు రోడ్డు ప్రమాదం (యాక్సిడెంట్) నే ప్లాన్ చేయాలంటూ ప్రియుడికి భార్య పంపిన మెసేజ్లు సోషల్ మీడియాలో, స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. “నా భర్తను యాక్సిడెంట్ చేసి చంపు.. లేదంటే నేనే చస్తా” అంటూ ప్రియుడిని భార్య కోరిన చాటింగ్ ఆధారాలు లభించడంతో బాధితుడు షాక్కు గురై పోలీసులను ఆశ్రయించాడు.

ఈ షాకింగ్ ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లు మండలం చిలుకోడు మరియు ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో వెలుగులోకి వచ్చింది.

వివాహం & కుటుంబం: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లు మండలం చిలుకోడుకు చెందిన గాదే రాజేశ్వరరావుకు సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన భవానితో 2016లో వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

కొరియర్ బాయ్తో అక్రమ సంబంధం: రాజేశ్వరరావు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తుండగా, భార్య భవాని కొరియర్ బాయ్గా పనిచేస్తున్న సైదులు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

రెడ్ హ్యాండెడ్గా దొరకడం: గత నెల 27న మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్లిన రాజేశ్వరరావు, భార్య వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండగా చూసి నిలదీశాడు.

వేధింపులు – చాటింగ్ బయటపడటం: గత నెల 28న పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టేందుకు అన్నను తీసుకురావడానికి వెళ్తున్న రాజేశ్వరరావును ప్రియుడు సైదులు బైక్పై వెంబడించాడు. తప్పించుకున్న రాజేశ్వరరావు ఇంటికొచ్చి భార్య ఫోన్ చెక్ చేయగా అసలు కుట్ర బయటపడింది.

యాక్సిడెంట్ ప్లాన్: ఇంట్లో కాకుండా బయట ఎవరితోనైనా యాక్సిడెంట్ చేయించి భర్తను చంపాలని, లేదంటే తాను చనిపోతానని భవాని వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లలో సైదులుకు పంపిన మెసేజ్ స్క్రీన్ షాట్లు లభ్యమయ్యాయి.

చాటింగ్ ఆధారాలతో ఈ నెల 1న డోర్నకల్లు పోలీస్ స్టేషన్లో బాధితుడు రాజేశ్వరరావు ఫిర్యాదు చేయగా, అధికారులు జీరో ఎఫ్ఐఆర్ (Zero FIR) నమోదు చేసి కేసును ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. అయితే పోలీసులు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడం, తనకు ప్రాణహాని ఉందనే భయంతో రాజేశ్వరరావు గురువారం ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో మరోసారి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిందని, నిందితులపై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామని ఖమ్మం రూరల్ సీఐ తెలిపారు.

Share
Share