Breaking News: శ్రీశైలం డ్యాం లోకి భారీగా వస్తున్న వరద ప్రవాహం..

శ్రీశైలం, ఏపీబీ న్యూస్: తెలుగు రాష్ట్రాల కీలక జలాశయమైన శ్రీశైలం డ్యామ్కు ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. పశ్చిమ కనుమలు, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోందని నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు.

శ్రీశైలం డ్యామ్ వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో మరియు నీటి నిల్వ గణాంకాలు ఇలా ఉన్నాయి:

  • ఇన్ఫ్లో (Inflow): 85,421 క్యూసెక్కులు
  • ఔట్ఫ్లో (Outflow): నిల్ (విద్యుత్ ఉత్పత్తి, కాలువల విడుదలతో కలిపి ప్రస్తుతం నీటి విడుదల లేదు)
  • పూర్తి స్థాయి నీటిమట్టం: 885 అడుగులు
  • ప్రస్తుత నీటిమట్టం: 827.30 అడుగులు
  • పూర్తి స్థాయి నీటి నిల్వ: 215.8070 టీఎంసీలు
  • ప్రస్తుత నీటి నిల్వ: 46.8234 టీఎంసీలు

ఎగువన ఉన్న జుర్రాలా, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల సాగుతుండటంతో శ్రీశైలం ఇన్ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇన్ ఫ్లో స్థిరంగా వస్తుండటంతో శ్రీశైలంలో నీటి మట్టం గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతానికి డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని దిగువన ఉన్న నాగార్జునసాగర్కు విడుదల చేయనప్పటికీ, ప్రాజెక్టు వద్ద నీటిమట్టాన్ని అధికారులు ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇన్ఫ్లో ఇలాగే కొనసాగితే నీటి నిల్వ పెరిగి, త్వరలోనే విద్యుత్ ఉత్పత్తితో పాటు దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది.

Share
Share