Breaking News: నీట్ (NEET 2026) పరీక్ష రద్దు.. పేపర్ లీక్.. సీబీఐ విచారణకు ఆదేశం..

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ 2026 పరీక్షపై లీకేజీ నీడలు కమ్ముకున్నాయి. రాజస్థాన్ రాష్ట్రంలో క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్లు పక్కా ఆధారాలు లభించడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

పరీక్షకు 48 గంటల ముందే రాజస్థాన్లోని ఒక ప్రముఖ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు తమ విద్యార్థులకు ఒక ‘ప్రాక్టీస్ పేపర్’ ఇచ్చారు. మే 3న జరిగిన అసలు పరీక్షలో సుమారు 600 మార్కుల విలువైన ప్రశ్నలు యథాతథంగా ఆ ప్రాక్టీస్ పేపర్ నుండే రావడాన్ని అధికారులు గుర్తించారు. ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదని, పేపర్ లీక్ వల్లే జరిగిందని నిర్ధారణకు వచ్చారు.

సీబీఐ విచారణ: ఈ భారీ నెట్వర్క్ వెనుక ఉన్న సూత్రధారులను పట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సీబీఐ (CBI) విచారణకు ఆదేశించింది.

ఉచితంగా రీ-ఎగ్జామ్: పరీక్ష రద్దు కావడంతో లక్షలాది మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అయితే, కేంద్రం నుండి తదుపరి ఆదేశాలు రాగానే మరోసారి పరీక్ష నిర్వహిస్తామని, ఈసారి విద్యార్థుల నుండి ఎలాంటి పరీక్ష ఫీజు వసూలు చేయబోమని NTA స్పష్టం చేసింది.

ఏడాది పొడవునా కష్టపడి చదివిన విద్యార్థులకు ఈ పేపర్ లీక్ వార్త పెద్ద పిడుగుపాటులా మారింది. వ్యవస్థలో ఉన్న లోపాల వల్ల కొందరు అక్రమార్కులు విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడం దురదృష్టకరం. త్వరలోనే నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Share
Share