- సిద్దిపేట – దుబ్బాక రహదారిలో ప్రమాదానికి గురైన టాటా ఏస్ వాహనం..
- కాన్వాయ్ నిలిపి సహాయక చర్యల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
- క్షతగాత్రులకు భరోసానిచ్చి ఆసుపత్రికి తరలింపు
దుబ్బాక, ఏపీబీ న్యూస్: రోడ్డు ప్రమాదాన్ని గమనించిన వెంటనే తన కాన్వాయ్‌ను నిలిపివేసి, క్షతగాత్రుల వద్దకు స్వయంగా వెళ్లి సహాయక చర్యల్లోపాల్గొనిమానవత్వాన్ని చాటుకున్నారు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి. ప్రమాదంలో గాయపడిన బాధితులకు తక్షణమే వైద్య సాయం అందేలా చొరవ చూపి స్థానికుల నీరాజనాలు అందుకున్నారు.
సిద్దిపేట నుంచి దుబ్బాక వైపు వెళ్తున్న సమయంలో ఇర్కోడు – తొర్నాల గ్రామాల మధ్య పండ్లను రవాణా చేస్తున్న ఒక టాటా ఏస్ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది.

ప్రమాద స్థలంలో ఎమ్మెల్యే స్పందన:
తక్షణ పరామర్శ: ప్రమాదాన్ని గమనించిన వెంటనే కాన్వాయ్‌ని ఆపిన ఎమ్మెల్యే, వాహనం దిగి బాధితుల వద్దకు చేరుకున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన క్షతగాత్రుల పరిస్థితిని అడిగి తెలుసుకుని వారికి కొండంత భరోసా ఇచ్చారు.
వైద్య సాయం మంజూరు: ఎలాంటి ఆలస్యం లేకుండా బాధితులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించాలని, మెరుగైన వైద్యం అందించాలని పోలీసులను, అధికారులను ఆదేశించారు.
విచారణకు ఆదేశం: ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులకు సూచించారు.
ఆపద సమయంలో వెంటనే స్పందించి బాధితులను కాపాడేందుకు తక్షణ చర్యలు చేపట్టిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి శైలిపై బాధితులతో పాటు స్థానిక ప్రజలు, వాహనదారులు ప్రశంసలు కురిపిస్తున్నారు.