Breaking News: నల్గొండ ప్రభుత్వాసుపత్రిలో బాలింత ఆత్మహత్య..

నల్గొండ, ఏపీబీ న్యూస్: నల్గొండ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ప్రాంగణంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరిన ఓ బాలింత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆవరణలోనే చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘోర ఉదంతం జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.

బాధితురాలి వివరాలు: నల్గొండ జిల్లా మునుగోడు మండలం చీకటి మామిడి గ్రామానికి చెందిన మమత అనే మహిళ వారం రోజుల క్రితం ప్రసవం నిమిత్తం నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. అక్కడ ఆమెకు నాలుగో సంతానంగా మళ్లీ ఆడపిల్ల జన్మించింది.

మగబిడ్డకు జన్మ: ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉన్న మమత, 8 రోజుల క్రితం జరిగిన ప్రసవంలో మగబిడ్డకు జన్మనిచ్చింది.

అనుమానాస్పద మృతి: బుధవారం తెల్లవారుజామున బాలింతల వార్డు నుంచి బయటకు వచ్చిన మమత, ఆ తర్వాత కొద్దిసేపటికే ఆసుపత్రి ప్రాంగణంలో మృతి చెంది కనిపించింది.

దగ్గు, ఆయాసం, కడుపు నొప్పి బాధతో తీవ్ర మనస్తాపానికి గురైన మమత, ఆసుపత్రి ఆవరణలోని ఒక చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు విడిచింది. ఉదయం గమనించిన రోగుల బంధువులు, సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న నల్గొండ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మగబిడ్డ పుట్టి కుటుంబంలో సంతోషం నిండాల్సిన సమయంలో, వారం రోజులకే బాలింత మృతి చెందడంతో ఆమె స్వగ్రామం చీకటిమామిడిలో శోకసంద్రం అలుముకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

Share
Share