- రూ.20 వేల కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నవి
- ప్రభుత్వాల వైఖరి కారణంగా ఆర్ధికంగా నష్టపోతున్నాం..
- గత ప్రభుత్వంలో చేపట్టిన ఎస్డీఎఫ్(SDF) నిధులే రూ.4వేల కోట్లు బాకీ
- రాజకీయాలతో కాంట్రాక్టర్లకు ముడిపెట్టెద్దు
- ఈనెల 18న చలో హైదరాబాద్ సమావేశంలో తుది నిర్ణయం ప్రకటిస్తాం
- సీఎం అపాయింట్మెంట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం
- ఆర్ధిక పరిస్థితులు బాగోలేకుంటే ప్రభుత్వాలు పనులు చేయోద్దు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) ప్రతినిధులు చెప్పారు. సోమవారం నల్లగొండలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. డీవీఎన్ రెడ్డి మాట్లాడుతూ.. బీఏఐ(BAI) అనేది ప్రభుత్వానికి, కాంట్రాక్టర్స్ కు మధ్య వారధి లాంటదని, తెలంగాణ ఏర్పడ్డాక 2017 వరకు మూడేండ్ల పాటు ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ విధానం అమల్లో ఉందని ఆ తర్వాత దాన్ని ఎత్తేశారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ సీరియల్ పాటిస్తారని ఆశించాం. కానీ అసలు కాంట్రాక్టర్ల బిల్లుల గురించే పట్టించుకోవడం లేదని, కొత్త ప్రభుత్వం వచ్చాక… కూడా ఇష్టం వచ్చినట్లుగా బిల్లులు చెల్లిస్తున్నారని విమర్శించారు.
రూపాయి ఉంటే రెండు రూపాయల పనులు చేయుంచాలే తప్పా.. వంద రూపాయాల పని ఎట్లా చేయిస్తారని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం కొత్త ఒరవడి సృష్టించిందని ఈ ప్రభుత్వ పనులా? గత ప్రభుత్వ పనులా అని వేరుచేసి చూస్తోందని మండిపడ్డారు. ఏ ప్రభుత్వమైన ప్రజల కోసమే పనులు చేయాలే తప్పా రాజకీయాలతో కాంట్రాక్టర్లకు ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో SDF ద్వారా చేసిన పనులు చాలా ఉన్నాయని, 4 వేల కోట్ల బిల్లులు ఎస్డీఎఫ్ పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. ఇప్పటివరకు కొన్ని వందల విజ్ఞాపన పత్రాలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం లో ఎలాంటి చలనం లేకుండా పోయిందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నామని, నిజంగానే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేకుంటే ఆ ప్రకారంగానే పనులు చేయాలి తప్పా కాంట్రాక్టర్లను ఆర్ధికంగా ఇబ్బందలకు గురిచేయోద్దని చెప్పారు.

నాగర్ కర్నూల్ లో మూడు నెలల కిందట శ్రీనివాస రెడ్డి అనే కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడని, అతనికి 10 కోట్ల బిల్లులు రావాలని, ఇప్పటికి ఆ బిల్లు మంజూరు చేయలేదని చెప్పారు. ఆర్ధిక పరిస్థితుల దృష్టిలో పెట్టుకుని సీరియల్ ప్రకారం బిల్లులు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఆలస్యం చేయడంతో ఇప్పటికే రూ.20 వేల కోట్ల బిల్లులు పెండింగ్ లో పడ్డాయని చెప్పారు. బిల్లులు రాక ఎంతో మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, దాంతోనే రాష్ట్ర స్థాయిలో ఈ నెల 18వ తేదీన తుది నిర్ణయం ప్రకటించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్రంలోని కాంట్రాక్టర్లు అందరం ఏకమై దైర్యం చెప్పుకుని ఒక నిర్ణయం తీసుకునేందుకే సమావేశం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
ఎస్ ఎన్ రెడ్డి మాట్లాడుతూ.. అప్ఘనిస్తాన్ లో వర్క్స్ చేయొచ్చు కానీ..
ఇక్కడ ప్రభుత్వాలు మానసికంగా చంపుతున్నాయని, అందరికీ దైర్యం చెప్పందుకే ఈ మీటింగ్ ఏర్పాటు చేశామని అన్నారు. ప్రభుత్వం ఆలోచించకుంటే ఈ మీటింగ్ లో మేము కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తదని హెచ్చరించారు. 98 శాతం కాంట్రాక్టర్స్ పనులు చేయడం కోసం ఆస్తులు కుదవ పెట్టుకున్నారని, గత పదేళ్ల నుంచి ప్రభుత్వం మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, ప్రభుత్వం వద్ద డబ్బు లేదన్న కారణంతో మా బిల్లులు ఆపొద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో BAI నేతలు CH.శ్రీనివాసరావు, సంతోష్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఎస్. కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.