Breaking News: నల్లగొండ: మైనర్ బాలికపై అత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పు

నల్లగొండ/మిర్యాలగూడ, ప్రతినిధి, ఏపీబీ న్యూస్: మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన దారుణమైన కేసులో నల్లగొండ జిల్లా ఫోక్సో (POCSO) ప్రత్యేక న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. కరీంనగర్కు చెందిన నిందితుడికి ఏకంగా 25 ఏళ్ల కారాగార శిక్ష విధిస్తూ గురువారం (ఆగస్టు 13, 2026) తీర్పు చెప్పింది.

ఘటన నేపథ్యం: మే 30, 2020న మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం వెలుగుచూసింది. కరీంనగర్కు చెందిన నిందితుడు మహమ్మద్ జాకీర్ బాబా.. సోషల్ మీడియా (సామాజిక మాధ్యమాలు) ద్వారా మిర్యాలగూడకు చెందిన మైనర్ బాలికతో పరిచయం ఏర్పరచుకున్నాడు.

కిడ్నాప్ & అత్యాచారం: పరిచయం సాకుగా మిర్యాలగూడ వచ్చిన నిందితుడు.. సదరు బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత మైనర్ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్షన్ 448, 366(2)(i) IPC మరియు సెక్షన్ 3 & 4 POCSO చట్టం-2012 కింద కేసు నమోదు చేశారు.

బలమైన వాదనలు: విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్ బలమైన ఆధారాలు సేకరించి, కోర్టు ముందు వాదనలు వినిపించారు.

25 ఏళ్ల జైలు శిక్ష: ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన గౌరవ POCSO న్యాయస్థానం న్యాయమూర్తి విశ్వనాథ్ కులకర్ణి దిలీప్ రావు తీర్పునిచ్చారు. సెక్షన్ 366(2)(i) కిడ్నాప్ కింద 5 సంవత్సరాలు, మరియు సెక్షన్ 3 & 4 POCSO యాక్ట్ కింద 20 సంవత్సరాల శిక్ష.. మొత్తంగా 25 ఏళ్ల కారాగార శిక్షను ఖరారు చేశారు.

అభాగ్యురాలైన బాధిత మైనర్ బాలికకు రూ. 5 లక్షల పరిహారాన్ని (కంపెన్సేషన్) అందజేయాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసును శాస్త్రీయ దృక్కోణంలో విచారించి ఆధారాలు సేకరించడంలో అప్పటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) డి. శ్రీనివాస్ రెడ్డి, CDO బి. అఖిల్, భరోసా లీగల్ ఆఫీసర్ మామిడి కల్పన తదితర అధికారులు కీలక పాత్ర పోషించగా, వారి సేవలను అధికారులు అభినందించారు.

Share
Share