Breaking News: కర్ణాటక కాంగ్రెస్ సర్కార్‌కు భారీ షాక్.. ఎమ్మెల్యే రాజీనామా..

బెంగళూరు, ఏపీబీ న్యూస్: కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వంలో తీవ్ర అసమ్మతి జ్వాలలు ఎగసిపడ్డాయి. రాష్ట్రంలో చేపట్టిన కేబినెట్ విస్తరణ/పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పార్టీలో తీవ్ర తిరుగుబాటుకు దారితీసింది. మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై తీవ్ర తీవ్ర అసంతృప్తికి లోనైన విజయపుర జిల్లా ఇండి నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే యశవంతరాయగౌడ వి. పాటిల్ తన శాసనసభ సభ్యత్వానికి సంచలన రాజీనామా చేశారు.

ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను డిప్యూటీ స్పీకర్ రుద్రప్ప లమాణికి సమర్పించి, ఆమోదించాలని కోరారు. ప్రాతినిధ్యం మరియు పదవుల కేటాయింపులో పార్టీ అధిష్టానం తమకు అన్యాయం చేసిందని ఆయన బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే రాజీనామా: మంత్రివర్గంలో స్థానం లభించకపోవడంతో ఎమ్మెల్యే పదవికి గుడ్బై చెప్పిన విజయపుర (ఇండి) ఎమ్మెల్యే యశవంతరాయగౌడ పాటిల్.

మరో వికెట్ పడేనా?: బేలూరు నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే గోపాలకృష్ణ సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఆయన కూడా రాజీనామా బాట పట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరో 10 మంది ఎమ్మెల్యేల అసమ్మతి: దాదాపు మరో పది మందికి పైగా సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేబినెట్ కూర్పుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, వారు కూడా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కేబినెట్ పదవుల కేటాయింపు మొదటి నుంచీ సున్నితమైన అంశంగానే మారింది. తాజాగా చేపట్టిన విస్తరణలో పలువురు సీనియర్లకు ప్రాతినిధ్యం దక్కకపోవడంతో అసమ్మతి వర్గం ఏకమవుతోంది. ఒక్కసారిగా ఎమ్మెల్యేల రాజీనామాలు, తిరుగుబాటు హెచ్చరికలతో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి కాంగ్రెస్ హైకమాండ్తో అత్యవసరంగా సంప్రదింపులు జరుపుతున్నారు. రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిణామాలు కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి.

Share
Share