Breaking News: నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య భర్త శ్రీనివాస్ రెడ్డికి భద్రత తొలగింపు..

నల్లగొండ, ఏపీబీ న్యూస్: నల్లగొండ కార్పోరేషన్ మేయర్ బుర్రి చైతన్య భర్త, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డితో సహా, జిల్లాలో పలువురు రాజకీయ నాయకులకు కేటాయించిన వీఐపీ భద్రతను ప్రభుత్వం రద్ధు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 67 మంది లీడర్లకు గన్మెన్లను తొలగిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీళ్లలో జిల్లాలో మాజీ ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్, బీజేపీ నేతలు వీరెల్లి చంద్రశేఖర్, గోలి మధుసూధన్ రెడ్డిలకు కేటాయించిన గన్మెన్లను ప్రభుత్వం తొలగించింది.

వీళ్లలో బుర్రి శ్రీనివాస్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు ప్రాణహాని ఉందని ఇంటిలిజెన్స్ రిపోర్ట్ మేరకు ప్రభుత్వం భద్రత కల్పించింది. దాంతోపాటు గతంలో రద్ధు చేసిన గన్ లైసెన్స్ ను కూడా పునరుద్దరించింది. ఇప్పుడు చైర్మన్ పదవిలో లేనందున గన్మెన్లు రద్ధు చేసింది. కాగా ఇటీవల నల్లగొండ సీఎం సభ వేధిక పైన జరిగిన గొడవ కూడా గన్మెన్ల తొలగింపుకు కారణమని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తుండగా, ఇంటిలిజెన్స్ నిఘా వర్గాల రిపోర్ట్ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Share
Share