- హైకోర్టు ఆదేశాల మేరకు ఇంచార్జిల ఉత్తర్వులను ఉపసంహరించుకున్న ప్రభుత్వం
- పాత పద్ధతినే కొనసాగించాలని కోర్టు ఆదేశం
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు చైర్మన్లనే కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు గతేడాది డిసెంబర్ లో ప్రభుత్వం జారీ చేసిన జీఓ(GO) 597ను ఉపసహరించుకుంది. కోర్టు ఆదేశాలకు లోబడి పాత కమిటీలనే మళ్లీ కొనసాగించాలని గత నెల 24న ప్రభుత్వం జీవో నంబరు 199 జారీ చేసింది. దాంతో సోమవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సొసైటీ చైర్మన్లు, పాలకవర్గాలు తిరిగి బాధ్యతలు చేపట్టాయి. మళ్లీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించే వరకు ఇప్పుడున్న సొసైటీ కమిటీలో పనిచేస్తాయి. దాంతో సొసైటీల్లో కొనసాగుతున్న ఇంచార్జిలు పాలన రద్ధు అయ్యింది.
ఇదిలా వుంటే డీసీసీబీ(DCCB) పాలకవర్గాల పైన కూడా కోర్టులో కేసు నడుస్తోంది. మంగళవారం దీని పైన కోర్టు తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. డీసీసీబీ చైర్మన్నే మాత్రమే కొనసాగిస్తూ, డైరక్టర్లను రెన్యువల్ చేయకపోవడంతో డీసీసీబీ డైరక్టర్లు హైకోర్టులో కేసు వేశారు. దీంతో ప్రభుత్వం మొత్తం డీసీసీబీ పాలకవర్గాలను రద్ధు చేసింది. తాజాగా పీఏ సీఎస్ల(PACS)కు ఇచ్చిన వెసులుబాటు డీసీసీబీలకు వస్తుందనే నమ్మకంతో డైరక్టర్లు ఉన్నారు. కాగా ఇప్పుడున్న పీఏసీఎస్ చైర్మన్ల్లో చాలా మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన వాళ్లే. ఇంకొందరు బీఆర్ఎస్లోనే ఉన్నారు. కోర్టులో కేసు ఫైల్ చేసిన వాళ్లలో బీఆర్ఎ స్ చైర్మన్లే ఉండటం, వీళ్ల పదవీ కాలం ఎప్పుడో పూర్తియినందున త్వరలోనే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఏపీ తరహాలోనే తెలంగాణలో కూడా సొసైటీ చైర్మన్లు, డైరక్టర్లను ప్రభుత్వమే నామినేట్ చేయాలని భావిస్తోంది. దీనికి చట్టపరంగా ఎలాంటి సవరణలు అవసరం లేదని, మార్కెట్ కమిటీల తరహాలోనే నామినేట్ చేస్తారని చెప్తున్నారు.