Good News: నల్లగొండ జిల్లాలో ఆశాజనకంగా భూగర్భజలాలు..

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ జిల్లాలో భూగర్భజల మట్టాలు సగటున 7.18 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. గతేడాది ఏప్రిల్ తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్ లో 1.29 ఎత్తుకు నీటి మట్టాలు పెరిగాయి. నైరుతి, ఈశాన్య రుతుపవనాల కారణంగా జిల్లాలో సమృద్ధిగా వానలు పడ్డాయి. దాంతో భూగర్భజలాలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. గతేడాది ఏప్రిల్ లో 8.46 మీటర్ల ఎత్తులో నీటి మట్టాలు ఉండగా, ఈ ఏడాది అదే రోజుల్లో 7.18 మీటర్లకు ఎత్తుకు పెరిగాయి. 31 మండలాల్లో 26 మండలాలు సేఫ్ జోన్లో ఉండగా, ఐదు మండలాల్లో నీటిమట్టాలు అడుగంటిపోయాయి. గతేడాదితో పోలిస్తే అడవిదేవులపల్లి మండలంలో -0.33 అడుగులకు నీటిమట్టాలు పడిపోగా, డిండి మండలంలో -6.80, మిర్యాలగూడలో -1.58 అడుగులు, నార్కట్ పల్లిలో -0.02 అడుగులు, వేములపల్లి మండలంలో -0.44 అడుగులకు నీటి మట్టాలు పడిపోయాయి. నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రాంతమైన నాగార్జునసాగర్, మిర్యాలగూడ ఏరియాల్లో నీటిమట్టాలు హెచ్చుతగ్గులు కనిపిస్తుండగా, ఏఎమ్మార్పీ ప్రధాన కాలువ పరిధిలోని నీటి నిల్వలు సమృద్ధిగానే ఉన్నట్టు  నివేధికలు చెప్తున్నాయి. అయితే ఈ ఏడాది మార్చితో పోలిస్తే మాత్రం ఏప్రిల్లో నీటి మట్టాలు -0.49 అడుగులకు పడిపోయినట్టు భూగర్భజల నివేధికలు చెప్తున్నాయి. మేలో పగటి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరినందున రాబోయే రోజుల్లో నీటి మట్టాలు పడిపోయే అవకాశం ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికైతే తాగునీటి అవసరాల నిమిత్తం పుట్టంగండి, ఉదయసముద్రం, బ్రహ్మణ వెల్లంల రిజర్వాయర్లలో నీటి నిల్వలు గరిష్టస్థాయిలోనే ఉన్నాయి.

మండలంఏప్రిల్-26ఏప్రిల్-25
అడవిదేవులపల్లి4.253.92
అనుముల4.845.80
చందంపేట5.629.60
చందూర్9.5411.49
చింతపల్లి9.9613.13
చిట్యాల8.8213.21
దామరచర్ల12.6812.96
దేవరకొండ8.219.12
గట్టుప్పల్7.429.99
గుండ్లపల్లి13.206.41
గుర్రంపోడు3.494.94
కనగాల్6.577.58
కట్టంగూర్8.6510.64
కేతేపల్లి2.012.92
కొండమల్లేపల్లి3.946.07
మాడుగులపల్లి6.238.36
మర్రిగూడ11.3512.92
మిర్యాలగూడ3.061.47
మునుగోడు9.8211.20
నక్రేకల్7.287.29
నల్గొండ7.018.71
నాంపల్లి2.7711.87
నార్కెట్పల్లి8.388.36
నేరెడుగొమ్ము7.648.30
నిడమనూరు7.899.10
పి.ఏ.పల్లి5.346.62
పెద్దవూర5.946.93
శాలిగౌరారం4.876.38
తిప్పర్తి1.912.89
తిర్మలగిరి సాగర్8.059.71
త్రిపురారం2.492.92
వేములపల్లి4.403.96
గుడిపల్లి0.942.35
Share
Share