- నకిరేకల్ రెవిన్యూ అధికారుల పై పెరుగుతున్న ఒత్తిళ్లు
- ఎమ్మెల్యే వ్యాఖ్యలతో రెవిన్యూ వర్గాల్లో కలకలం
- డిప్యూటీ ఇన్స్పెక్టర్ పవన్‌కుమార్ ఏసీబీకి చిక్కడం పై చర్చ
- తహశీల్దార్లు లక్ష్యంగా రాజకీయ ఒత్తిళ్లు
- భూముల వివాదాల నేపథ్యంలో కొత్త అనుమానాలు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నకిరేకల్ నియోజకవర్గంలో రెవిన్యూ యంత్రాంగం చుట్టూ భూముల వివాదాలు ముసురుకుంటున్నాయి. తహశీల్దార్ల పనితీరుపై ఎమ్మెల్యే వేముల వీరేశం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం కాగా, ఆ వెంటనే సర్వే, ల్యాండ్స్ విభాగానికి చెందిన డిప్యూటీ ఇన్స్పెక్టర్ పవన్‌కుమార్ ఏసీబీకి చిక్కడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఈ పరిణామాల వెనక కేవలం అవినీతి ఆరోపణలేనా? లేక భూ వ్యవహారాలు, రాజకీయ ఒత్తిళ్లు కూడా కారణమా? అన్న చర్చ రెవిన్యూ వర్గాల్లో సాగుతోంది.
ఇన్ స్పెక్టర్ పవన్ కేసుతో.. యంత్రాంగంలో గుబులు
నకిరేకల్ నియోజకవర్గంలో రెవిన్యూ అధికారుల పనితీరుపై ఎమ్మెల్యే వేముల వీరేశం ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. రైతులు, సామాన్య ప్రజలు తహశీల్దార్ ఆఫీసులకు వెళ్లి సంతృప్తిగా తిరిగి రావడం లేదని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పలు మండలాల తహశీల్దార్లతో సమావేశమైన ఎమ్మెల్యే, వారి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ హెచ్చరించినట్లు అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే నల్లగొండ ఆర్డీఓ(RDO) కార్యాలయంలో డెప్యూటేషన్ పై విధులు నిర్వహిస్తున్న సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగం డిప్యూటీ ఇన్స్పెక్టర్ పవన్‌కుమార్ ఏసీబీకి చిక్కడం జిల్లాలో సంచలనంగా మారింది. వరంగల్ జిల్లాకు చెందిన పవన్‌కుమార్ కొద్ది నెలల క్రితమే నల్లగొండకు బదిలీపై వచ్చారని, విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహా రిస్తారని సహచరులు చెబుతున్నారు. అయితే పవన్‌కుమార్ అరెస్టు వ్యవహారం వెనుక పలు కోణాలు ఉన్నాయన్న చర్చ ప్రస్తుతం రెవిన్యూ శాఖ లో సాగుతోంది. చిట్యాల మండలంలోని సుమారు 50 ఎకరాల భూమి సర్వే కోసం పిటిషనర్లు నేరుగా సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగానికి దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో స్థానిక మండల సర్వేయర్‌తో కలిసి ఇన్ స్పెక్టర్ సర్వే నిర్వహించారు. సర్వే అనంతరం భూమి రికార్డుల విషయంలో పిటిషనర్లు, అధికారుల మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం. సర్వే సమయంలో లేదా సర్వేకు వెళ్లే ముందు ఇన్ స్పెక్టర్ పవన్ ఎలాంటి డబ్బులు డిమాండ్ చేయలేదని, పిటిషనర్లే తమ ఇష్ట ప్రకారం రూ.20 వేల నగదు ఇచ్చినట్లు రెవిన్యూ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే సర్వే రిపోర్ట్ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఇవ్వడానికే పవన్‌కుమార్ సిద్ధపడటంతో కొందరు అసంతృప్తికి గురయ్యారని, ఈ క్రమంలో ఆయనతో వాగ్వాదం జరిగినట్లు చెబుతున్నారు. ఈ వివాదం అనంతరం శుక్రవారం సర్వే రిపోర్టు తీసుకునేందుకు పిటిషనర్లు నల్లగొండ కు వచ్చినట్లు తెలుస్తోంది. పవన్‌కుమార్ నివాసం ఉంటున్న కలెక్టరేట్ సమీపానికి చేరుకున్న వారు రిపోర్టు తీసుకున్న తర్వాత మరోసారి నగదు అందించినట్లు సమాచారం. అదే సమయంలో అక్కడ నిఘా ఉంచిన ఏసీబీ అధికారులు నగదు లావాదేవీ జరుగుతుండగా పవన్‌కుమార్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో అసలు లంచం డిమాండ్ జరిగిందా? లేక ముందుగా ఏర్పడిన విభేదాల నేపథ్యంలో పథకం ప్రకారమే ఏసీబీకి సమాచారం ఇచ్చారా? అనే అంశాలపై రెవిన్యూ శాఖలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తహాశీల్దార్లలో ఆందోళన..
పవన్‌కుమార్ ఘటన తర్వాత నియోజకవర్గంలోని పలువురు తహశీల్దార్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన కొందరు నేతల సూచనలకు అనుగుణంగా పనిచేయని అధికారులను లక్ష్యంగా చేసుకుని ఒత్తిళ్లు పెరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిట్యాల, కట్టంగూరు, కేతేపల్లి, నార్కట్‌పల్లి మండలాల్లో రెవిన్యూ అధికారుల పనితీరు బాగోలేదని బహిరంగంగా చెబుతున్నప్పటికీ, దీని వెనక భూ వ్యవహారాలకు సంబంధించిన ప్రయోజనాలు ఉన్నాయన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూములు, భూదాన భూములు, సాదా బైనామా పిటిషన్లు, భూ వివాదాల పరిష్కారాల్లో అధికారుల నుంచి ఆశించిన సహకారం లభించకపోవడం వల్లే కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నారని రెవిన్యూ వర్గాలు చెబుతున్నాయి. నార్కట్‌పల్లి మండలంలో వివేరా హోటల్ సమీపంలోని ప్రభుత్వ భూములపై కొందరి కన్ను పడిందని, కట్టంగూరు మండలంలో భూదాన భూముల ఆక్రమణకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేతేపల్లి తహశీల్దార్ ఆపీసుకు సంబంధించిన మరో వ్యవహారం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఓ న్యాయవాది నుంచి గతంలో తీసుకున్న నగదును తిరిగి ఇవ్వాలంటూ రెవిన్యూ సిబ్బందిపై అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అదేవిధంగా నియోజకవర్గంలో సాదా బైనామా పీటీషన్లు నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ తమకు అనుకూలమైన వ్యక్తులకు క్రమబద్ధీకరించాలనే ఒత్తిళ్లతో రెవిన్యూ సిబ్బంది సతమతమవుతున్నారు. కొత్తగా వచ్చిన చిట్యాల తహాశీల్దార్ పనితీరు పై కూడా అప్పుడే రాజకీయ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో గతేడాది చిట్యాల తహశీల్దార్ కృష్ణ ఏసీబీకి చిక్కిన ఘటన వెనుక కూడా ఇలాంటి పరిణామాలే ఉన్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాము సూచించిన విధంగా పనిచేయకపోతే ఉన్నతాధికారులు, రెవిన్యూ మంత్రిత్వ శాఖ దృష్టికి విషయాలను తీసుకెళ్తామని రూలింగ్ పార్టీ లీడర్లు హెచ్చరిస్తున్నారు. దీంతో అనవసర వివాదాల్లో చిక్కుకోవడం కంటే బదిలీపై ఇతర ప్రాంతాలకు వెళ్లడమే మంచిదన్న భావనతో కొందరు అధికారులు తెరవెనుక ప్రయత్నాలు ప్రారంభించినట్లు రెవిన్యూ వర్గాల్లో చర్చ సాగుతోంది.
APB News Exclusive: ఎమ్మెల్యే చురకలు.. ఏసీబీ ఉచ్చు!