Big Breaking News: కాంగ్రెస్‌కు గుడ్‌బై.. బీఆర్‌ఎస్‌లోకి కొండా జంట?

హైదరాబాద్ ఏపీబీ న్యూస్: కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్ర అల్టిమేటం జారీ చేయడం, రాజీనామా చేయకుంటే బర్తరఫ్ చేస్తామని స్పష్టం చేయడంతో మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి దంపతులు తమ తదుపరి రాజకీయ అడుగులపై వేగంగా నిర్ణయం తీసుకున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న కొండా సురేఖ దంపతులు, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మళ్లీ బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పార్టీలో చేరబోతున్నారనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో తీవ్రంగా నడుస్తోంది.

ఢిల్లీలో నిన్న జరిగిన కీలక భేటీలు, సీఎం రేవంత్ రెడ్డి వర్గం తీరు, అధిష్ఠానం వ్యవహరించిన వైఖరిపై కొండా మురళి దంపతులు ఇప్పటికే బీఆర్ఎస్ ముఖ్య నేతలతో సుదీర్ఘ చర్చలు జరిపినట్లు సమాచారం.

మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్: కొండా సురేఖ దంపతులు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మీడియా ముందుకు రానున్నారు. ఢిల్లీలో జరిగిన భేటీల వివరాలను బహిరంగపరచి, తమపై జరిగిన కుట్రలను వివరించనున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్కు రాజీనామా ప్రకటన?: కేవలం మంత్రి పదవికే కాకుండా కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి, తమ హుందాత్వాన్ని చాటుకోవాలని కొండా కుటుంబం భావిస్తోంది.

బీఆర్ఎస్లోకి రీ-ఎంట్రీ?: కాంగ్రెస్కు రాజీనామా చేసిన వెంటనే, తమ పాత పార్టీ అయిన బీఆర్ఎస్లోకి తిరిగి చేరేందుకు గులాబీ దళంతో ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.

తన కుమార్తె సుష్మిత చేసిన వ్యాఖ్యలను సాకుగా చూపి బిసి వర్గానికి చెందిన తనను రాజకీయంగా తొక్కేసేందుకు కాంగ్రెస్ లోని ఒక వర్గం కుట్ర చేసిందని కొండా సురేఖ భావిస్తున్నారు. బిసి నేతగా తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడమే ప్రాధాన్యమని, పార్టీ నుంచి బర్తరఫ్ అయ్యే పరిస్థితి తెచ్చుకోకుండా ముందే పార్టీకి స్వస్తి పలకాలని కొండా దంపతులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

మధ్యాహ్నం 3 గంటల ప్రెస్ మీట్ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా వరంగల్ పాలిటిక్స్లో ఎలాంటి భూకంపం రాబోతోందో అనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Share
Share