Breaking News: ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళపై సీఐ బాపతు: బ్లాక్‌మెయిలింగ్‌తో రూ.2 కోట్లు కాజేసి..

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: పోలీస్ శాఖకే తీవ్ర మచ్చ తెచ్చేలా ప్రవర్తించిన ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI) దారుణ భాగోతం వెలుగులోకి వచ్చింది. న్యాయం చేయాలని కోరుతూ ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఒక బాధితురాలిపై కన్నువేసి, మాయమాటలతో లొంగదీసుకుని, తీవ్ర అన్యాయానికి గురిచేసిన హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సీఐ U. శ్రీనివాసరెడ్డి (శ్రీనివాసులు రెడ్డి) సస్పెన్షన్కు గురయ్యారు.

కుటుంబ సమస్యలపై ఫిర్యాదు ఇచ్చేందుకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు వచ్చిన సదరు మహిళకు సీఐ శ్రీనివాసరెడ్డి మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, చాకచక్యంగా లోబరుచుకుని సహజీవనం చేశాడు. ఈ క్రమంలో మహిళ గర్భం దాల్చగా, బెదిరింపులకు దిగి బలవంతంగా అబార్షన్ చేయించినట్లు తెలుస్తోంది. అంతటితో ఆగకుండా, ఆమెకు తెలియకుండా రహస్యంగా చిత్రీకరించిన ప్రైవేట్ వీడియోలను చూపిస్తూ బ్లాక్మెయిలింగ్కు పాల్పడ్డాడు. ఈ వీడియోల ఆధారంగా బాధితురాలి నుంచి ఏకంగా రూ. 2 కోట్ల వరకు కాజేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

నిందితుడు: హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సీఐ U. శ్రీనివాసరెడ్డి.

దోపిడీ & అక్రమాలు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం, బలవంతపు అబార్షన్, రహస్య వీడియోలతో రూ.2 కోట్లు కాజేయడం.

డీజీపీకి ఫిర్యాదు: బాధిత మహిళ అన్ని ఆధారాలతో తెలంగాణ డీజీపీకి నేరుగా ఫిర్యాదు చేయడం.

పోలీసుల చర్యలు: విచారణ అనంతరం సీఐ శ్రీనివాసరెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారుల ఉత్తర్వులు జారీ.

సీఐ శ్రీనివాసరెడ్డి వేధింపులు తాళలేకపోయిన బాధితురాలు, ఆయన అక్రమాలు, వీడియోల బెదిరింపులు మరియు నగదు బదిలీలకు సంబంధించిన అన్ని ఆధారాలతో తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)ని కలసి నేరుగా ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదుపై తీవ్రంగా స్పందించిన ఉన్నతాధికారులు, ప్రాథమిక విచారణ జరిపి ఆరోపణలు నిజమేనని తేలడంతో సీఐ U. శ్రీనివాసరెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనపై చట్టపరమైన క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణ జరుపుతామని పోలీసులు వెల్లడించారు.

Share
Share