గచ్చిబౌలి స్టేడియంలో గ్రాండ్‌గా రాయల్ స్టాగ్ బూమ్‌బాక్స్ 4వ ఎడిషన్..

హైదరాబాద్ ఏపీబీ న్యూస్: హైదరాబాద్ నగర మ్యూజిక్ క్యాలెండర్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న లైవ్ మ్యూజిక్ ఈవెంట్లలో ఒకటైన ‘రాయల్ స్టాగ్ బూమ్బాక్స్’ (Royal Stag Boombox) 4వ ఎడిషన్తో హెల్ ఎనర్జీ డ్రింక్ (HELL Energy Drink) భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ గ్రాండ్ మ్యూజిక్ ఫెస్టివల్కు హెల్ ఎనర్జీ ‘కో-పవర్డ్ బై స్పాన్సర్’ (Co-powered by Sponsor)గా వ్యవహరిస్తోంది. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యూజిక్ ఫెస్టివల్ ద్వారా బ్రాండ్ భారతదేశంలోని లైవ్ మ్యూజిక్ కల్చర్, యువత సంస్కృతితో తన అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకుంది.

నాలుగో ఏడాదిలోకి అడుగుపెట్టిన ఈ ఫెస్టివల్ సంగీతం, వినోదం మరియు యువత జీవనశైలిని ఒకే వేదికపైకి తీసుకువస్తూ విశేష ఆదరణ పొందింది.

ఈ మ్యూజిక్ ఫెస్టివల్లో గ్లోబల్ హిప్-హాప్ స్టార్ ఫ్రెంచ్ మోంటానా (French Montana) ప్రధాన ఆకర్షణగా నిలిచి ప్రేక్షకులను ఊపేశారు. ఆయనతో పాటు:

  • ఎల్.వి. రేవంత్
  • నిఖితా గాంధీ
  • పాయల్ ధరే
  • డిజే సాహిల్ గులాటి

తదితర ప్రముఖ కళాకారులు తమ అద్భుతమైన ప్రదర్శనలతో అలరించారు. హిప్-హాప్, ఇండీ, మరియు బాలీవుడ్ సంగీతాల మేళవింపుతో సిద్ధమైన ఈ లైనప్ హైదరాబాద్ మ్యూజిక్ లవర్స్కు మరపురాని అనుభూతిని అందించింది.

“యువ భారతదేశానికి అత్యంత ముఖ్యమైన సందర్భాల్లో భాగం కావాలని మేము ఎప్పుడూ కోరుకుంటాం. అలాంటి సందర్భాల్లో లైవ్ మ్యూజిక్కు ప్రత్యేక స్థానం ఉంది. హైదరాబాద్ నుంచి మాకు ఎప్పుడూ అద్భుతమైన స్పందన లభిస్తోంది. బూమ్బాక్స్కు కో-పవర్డ్ బై పార్టనర్గా భాగస్వామ్యం కావడం ద్వారా మేము ఈ అనుభూతికి నేరుగా కేంద్రంగా నిలుస్తున్నాం. యువత జీవనశైలి, లైవ్ మ్యూజిక్పై వారి అభిరుచిని నిజంగా ప్రతిబింబించే వేదికలో వారిని కలుసుకునే అవకాశాన్ని ఈ ఫెస్టివల్ మాకు అందించింది.”

యువతలో సంగీతం, నైట్లైఫ్, మరియు లైవ్ ఈవెంట్లపై పెరుగుతున్న ఆసక్తి కారణంగా తెలంగాణ రాష్ట్రం హెల్ ఎనర్జీ బ్రాండ్కు అత్యంత కీలకమైన మార్కెట్గా కొనసాగుతోంది. రాయల్ స్టాగ్ బూమ్బాక్స్ భాగస్వామ్యం ద్వారా బ్రాండ్ తన శక్తినంతటినీ ప్రతిబింబించే వేదికపై యువతను నేరుగా చేరువైంది.

Share
Share