బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్పై షాద్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..
రగిలిపోతున్న తెలంగాణ రాజకీయం!
హైదరాబాద్ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: తెలంగాణ రాజకీయంలో తీవ్ర వివాదాస్పద శైలి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గులాబీ దళపతి, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ను ఉద్దేశించి షాద్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. కేసీఆర్ మరణాన్ని కాంక్షిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
తీవ్ర వ్యాఖ్యలు – వెల్లువెత్తిన నిరసనలు
మాజీ సీఎం కేసీఆర్ రాజకీయ వైఖరి, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలపై స్పందిస్తూ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడారు:
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వ్యాఖ్యలు:
“కేసీఆర్ చనిపోవాలని నేను కోరుకుంటున్నాను.”
“కేసీఆర్ సచ్చిపోవాలి..” అని ఆయన తీవ్రస్థాయిలో ఆవేశపూరిత వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా స్పందించారు. ఒక బాధ్యతాయుతమైన శాసనసభ్యుడిగా ఉండి, నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రి మరియు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిపై ఇటువంటి వ్యక్తిగత, వికృత వ్యాఖ్యలు చేయడం అసహ్యకరమని ఖండించారు.
కాంగ్రెస్ సంస్కృతికి నిదర్శనం – బీఆర్ఎస్ ఫైర్
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ స్పందిస్తూ.. ఇది కాంగ్రెస్ నాయకుల దిగజారుడు రాజకీయ సంస్కృతికి నిదర్శనమని మండిపడింది. రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, వెంటనే ఎమ్మెల్యే శంకర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. లేనిపక్షంలో కాంగ్రెస్ నాయకులను అడ్డుకుంటామని హెచ్చరించింది.
ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
Video: కేసీఆర్ చనిపోవాలని కోరుకుంటున్నాం: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సంచలన వ్యాఖ్యలు..