పోక్సో కేసులో సంచలనం: 14 మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు..

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బండి భగీరథ్ పోక్సో కేసులో చట్టపరమైన చర్యలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ వైపు మళ్లాయి. నిందితుడిని వెనకేసుకొస్తూ, బాధితురాలి వివరాలను మరియు ఆమె క్యారెక్టర్ను తప్పుబట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు పెట్టిన 14 మంది ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు అధికారికంగా కేసులు నమోదు చేశారు.

బాధితురాలి తరఫున నిలబడాల్సిన కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు భారీగా డబ్బులు (Paid Promotions) తీసుకుని నిందితుడికి అనుకూలంగా పీఆర్ (PR) స్టంట్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

పిటిషన్ల వెల్లువ: ఈ వ్యవహారానికి సంబంధించి హైదరాబాద్లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో మొత్తం 27 మంది సోషల్ మీడియా హ్యాండిల్స్, ఇన్ఫ్లుయెన్సర్లపై బాధితుల తరఫున మరియు స్వచ్ఛంద సంస్థల నుండి పిటిషన్లు దాఖలయ్యాయి.

14 మందిపై ఎఫ్ఐఆర్: ప్రాథమిక ఆధారాలు, లీగల్ నిబంధనల ప్రకారం దర్యాప్తు చేసిన పోలీసులు.. అందులో అత్యంత తీవ్రమైన వ్యాఖ్యలు, తప్పుడు ప్రచారం చేసిన 14 మందిపై ఐటీ యాక్ట్, పోక్సో చట్టంలోని నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేశారు.

పోక్సో చట్టం ప్రకారం బాధితురాలు మైనర్ అయినప్పుడు ఆమె గుర్తింపును గానీ, ఆమెకు సంబంధించిన వివరాలను గానీ ఎలాంటి మాధ్యమాల్లోనూ బహిర్గతం చేయకూడదు. ఈ నిబంధనను తుంగలో తొక్కి, వ్యూస్ కోసం మరియు డబ్బుల కోసం బాధితురాలిని వేధించేలా కంటెంట్ క్రియేట్ చేసిన వారి బ్యాంక్ ఖాతాలను, డిజిటల్ లావాదేవీలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

వ్యూస్, లైక్స్, మరియు డబ్బుల కోసం ఒక మైనర్ బాలికపై జరిగిన అన్యాయాన్ని కప్పిపుచ్చుతూ, నిందితుడిని హీరోలా చూపేందుకు కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు ప్రయత్నించడం అత్యంత దారుణం. సోషల్ మీడియా అనేది సమాచార మార్పిడికి ఉపయోగపడాలి కానీ, ఇలాంటి పెయిడ్ అక్రమాలకు వేదిక కాకూడదు. ఈ కేసుల ద్వారా అయినా సోషల్ మీడియా ప్రపంచంలో బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించే వారికి గట్టి కనువిప్పు కలగాలి.

Share
Share