Breaking News: ఢిల్లీలో మరో నిర్భయ తరహా ఘోరం.. కదులుతున్న స్లీపర్ బస్సులో 16 ఏళ్ల..

న్యూఢిల్లీ, ఏపీబీ న్యూస్: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి నిర్భయ తరహా ఘోరం పునరావృతమై దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. కదులుతున్న ప్రైవేట్ స్లీపర్ బస్సులో 16 ఏళ్ల మైనర్ బాలికపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి (Gang Rape) పాల్పడిన దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 4వ తేదీ రాత్రి సమయంలో ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది.

కదులుతున్న బస్సులో ఘోరం: బాధితురాలు స్లీపర్ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో రాక్షసత్వానికి ఒడిగట్టారు. దాదాపు 45 నిమిషాల పాటు బస్సును ఢిల్లీ రోడ్లపై తిప్పుతూనే మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

నిందితుల అరెస్ట్: ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వేగంగా స్పందించి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన బస్సు డ్రైవర్ కుల్దీప్, కండక్టర్ సందీప్ ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఫాస్ట్ ట్రాక్ దర్యాప్తు: ఆకృత్యానికి ఉపయోగించిన స్లీపర్ బస్సును పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. సంఘటనా స్థలానికి ఫోరెన్సిక్ నిపుణులను రప్పించి బస్సులో కీలక ఆధారాలను సేకరించారు.

బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. మైనర్ బాలికపై దారుణానికి ఒడిగట్టిన నిందితులను కఠినంగా శిక్షించాలని, కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించాలని పలు మహిళా సంఘాలు, హక్కుల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Share
Share