APB News Exclusive: లిక్కర్‌ సేల్స్‌పై ఎల్‌నినో ఎఫెక్ట్‌..!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఉమ్మడి జిల్లాలో మద్యం విక్రయాలకు భారీ బ్రేక్ పడింది. సాధారణంగా పండుగలు, శుభకార్యాలు, ఇతర వేడుకలతో మద్యం విక్రయాలు ఊపందుకునే ఆగస్టు నెలలో ఈసారి సీన్ రివర్స్ అయింది. గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఈ నెల తొలి 20 రోజుల్లోనే సుమారు రూ.164 కోట్ల మేర మద్యం అమ్మకాల్లో తేడా కనిపిస్తోంది. లిక్కర్, బీర్ల విక్రయాలు భారీగా పడిపోవడంతో ఎక్సైజ్ ఆదాయంపైనా ప్రభావం పడుతోంది. ఈసారి వాతావరణం పరిస్థితుల్లో వచ్చిన మార్పులు కూడా మద్యం విక్రయాలపై ప్రభావం చూపుతున్నట్లు ఎక్సైజ్ వర్గాలు భావిస్తున్నాయి. సాధారణంగా ఆగస్టులో ఉండే వాతావరణ పరిస్థితులకు భిన్నంగా ఈసారి వర్షాలు, ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటుచేసుకోవడం, దాని ప్రభావంతో వినియోగదారుల కొనుగోళ్లు తగ్గడం సేల్స్ పడిపోవడానికి ఒక కారణంగా చెబుతున్నారు. దీనికి తోడు శ్రావణ మాసం ఆలస్యంగా రావడం కూడా ప్రధాన కారణంగా మారింది.

నాగార్జున సాగర్ ఆయకట్టు, ఏఎమ్మార్పీ ఆయకట్టు పరిధిలో ఈసారి పంటల సాగు కూడా గణనీయంగా పడిపోయింది. ఎలినినో ఎఫెక్ట్ కారణంగా వానలు లేక పోవడంతో కరువు చాయలు కనిపిస్తున్నాయి. బోరు బావులు నీటి మట్టాలు పడిపోవడం, చెరువుల్లో నీటి నిల్వలు పడిపోవడం తో సామన్య ప్రజలు ఆందోళనలో ఉన్నారు. లిక్కర్ సేల్స్ భారీగా జరిగే నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలోని సూర్యాపేట, నల్లగొండ జిల్లాలో కూడా సేల్స్ పడిపోవడం కరువు తీవ్రతకు అద్ధం పడుతోంది.

ఉమ్మడి జిల్లాలోని ఆరు ఎక్సైజ్ సూపరింటెండెంట్ (ఎస్హెచ్) పరిధుల్లో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. కొన్ని పరిధుల్లో ఏకంగా 50 శాతానికి పైగా సేల్స్ పడిపోయినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా లిక్కర్, బీర్ రెండు విభాగాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చండూరు, దేవరకొండ, హాలియా, నాంపల్లి, ఆలేరు, మోత్కూరు, SHOల పరిధిలో లిక్కర్, బీర్లు అమ్మకాలు 50 నుంచి 59 శాతానికి పడిపోగా, మిగతా స్టేషన్ల పరిధిలో 44 నుంచి 49 శాతం మేర సేల్స్ తగ్గాయి.

గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఈ నెల 20 రోజుల్లోనే సుమారు 1,60,324 లక్షల కాటన్ల లిక్కర్, 1,76,655 లక్షల కాటన్ల బీర్ల విక్రయాలు తగ్గాయి. గతేడాది ఆగస్టు 1 నుంచి 31 వరకు లిక్కర్ 3,31,454 కాటన్లు సేల్ కాగా, బీర్లు 4,72,936 కాటన్లు సేల్ అయ్యాయి. లిక్కర్ లో ఆర్డనరీ 39,960 కాటన్లు సేల్ కాగా, ప్రీమియం బ్రాండ్లు 2,91,494 కాటన్లు సేల్ అయ్యాయి. దీంతో ఎక్సైజ్ శాఖకు రూ. 350 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి 20వరకు (20రోజుల్లో) లిక్కర్ 1,171,130 కాటన్లు సేల్ కాగా, బీర్లు 2,96,281 కాటన్లు మాత్రమే సేల్ అయ్యాయి. లిక్కర్లో ఆర్డనరీ 26,809 కాటన్లు, ప్రీమియం 1,44,321 కాటన్లు పడిపోయాయి. ఈ 20 రోజుల్లో ఎక్సైజ్ శాఖకు వచ్చిన ఆదాయం కేవలం రూ.186 కోట్లు మాత్రమే.

శ్రావణమాసంలో కొంతమంది మద్యం వినియోగానికి దూరంగా ఉండటం, శుభకార్యాలు, ఇతర సామాజిక కార్యక్రమాల సంఖ్యలో మార్పులు రావడం కూడా సేల్స్పై ప్రభావం చూపినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి మాసాల క్యాలెండర్లో వచ్చిన మార్పులు కూడా విక్రయాలపై ప్రభావం చూపుతున్నాయి. నెలాఖరు వరకు ఇదే పరిస్థితి కొనసాగితే ఉమ్మడి జిల్లాలో మద్యం విక్రయాల తగ్గుదల మరింత స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. ఇప్పటికే రూ.164 కోట్ల మేర తగ్గిన విక్రయాలు నెలాఖరుకు ఎంత మేరకు చేరతాయన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు రానున్న రోజుల్లో పండుగలు, శుభకార్యాలు, వాతావరణ పరిస్థితుల్లో మార్పులను బట్టి సేల్స్ మళ్లీ పుంజుకుంటాయా? లేక ఇదే ట్రెండ్ కొనసాగుతుందా? అన్నది చూడాల్సి ఉంది.

గత నెలలో మద్యం అమ్మకాల ద్వారా ఎక్సైజ్ శాఖకు రూ.35 కోట్ల ఆదాయం పెరిగింది. 2025 జులై లిక్కర్ 3,07,016 లక్షల కాటన్లు, బీర్లు 3,8 7,803 లక్షల కాటన్లు సేల్ అయ్యాయి. దీంతో ప్రభుత్వానికి రూ.322 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది అదే రోజుల్లో (జులై) లిక్కర్ 3,24,04 8 లక్షల కాటన్లు, బీర్లు 4,78,167 లక్షల కాటన్లు సేల్ అయ్యాయి. దీంతో ఎక్సైజ్ శాఖకు రూ.357 కోట్ల ఆదాయం పెరిగింది.

ఉమ్మడి జిల్లాలో గతేడాది ఆగస్టుతో పోలిస్తే, ఈ ఏడాది ఆగస్టు 20 రోజుల్లో స్టేషన్ల వారీగా బీర్లు, లిక్కర్ అమ్మకాల్లో వ్యత్యాసం

స్టేషన్ పేరులిక్కర్ (కేసుల్లో)బీర్లు (కాటన్లలో)
చండూరు8,42411,809
దేవరకొండ11,16811,966
హాలియా11,41713,933
మిర్యాలగూడ13,76214,855
నకిరేకల్6,6269,684
నల్లగొండ16,9976,431
నాంపల్లి6,8792,707
హుజూర్నగర్10,2527,307
కోదాడ11,3295,945
సూర్యాపేట15,86622,571
తుంగతుర్తి8,5077,330
ఆలేరు10,34815,506
భువనగిరి12,7037,968
మోత్కూరు7,2306,414
రామన్నపేట8,8268,662
Share
Share