Breaking News: ఏపీలో 44 లక్షలు, హర్యానాలో 33.8 లక్షల ఓట్లు తొలగింపు: ECI

అమరావతి / న్యూఢిల్లీ, ఏపీబీ న్యూస్: కేంద్ర ఎన్నికల సంఘం (ECI) దేశవ్యాప్తంగా చేపట్టిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) ప్రక్రియ ద్వారా ఓటర్ల జాబితాల సమగ్ర ప్రక్షాళన శరవేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ మరియు హర్యానా రాష్ట్రాల్లో భారీగా నకిలీ, డూప్లికేట్, మరణించిన మరియు వేరే ప్రాంతాలకు శాశ్వతంగా తరలివెళ్లిన ఓటర్ల పేర్లను తొలగించినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ ప్రక్షాళన చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా 44 లక్షల ఓట్లు (మొత్తం ఓటర్లలో 10.8%) తొలగించబడగా, హర్యానాలో 33.8 లక్షల ఓట్లు (మొత్తం ఓటర్లలో 16%) తొలగింపునకు గురయ్యాయి.

ఆంధ్రప్రదేశ్: మొత్తం ఓటర్లలో 10.8% ఓట్లు (44 లక్షలు) చెల్లుబాటు కాకపోవడంతో జాబితా నుంచి తొలగించారు.

హర్యానా: రాష్ట్రంలోని మొత్తం ఓటర్ల సంఖ్యలో ఏకంగా 16% ఓట్లు (33.8 లక్షలు) తొలగించినట్లు ఈసీ వర్గాలు తెలిపాయి.

మరణించిన ఓటర్ల పేర్లు తొలగించకపోవడం, ఒకరికే రెండు మూడు చోట్ల ఓట్లు ఉండటం (డూప్లికేషన్), మరియు స్థానిక చిరునామాల్లో నివాసం ఉండకపోవడం (Absentee, Shifted, Dead – ASD) వంటి అంశాలను బిఎల్ఓల (BLO) ద్వారా ఇంటింటి సర్వే చేసి గుర్తించి ఈ చర్యలు తీసుకున్నారు.

ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికేనని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. అర్హులైన ఏ ఒక్క పౌరుడూ ఓటు హక్కు కోల్పోకూడదనే ఉద్దేశంతో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల అనంతరం 30 రోజుల వ్యవధిలో అభ్యంతరాలు, క్లెయిమ్లు (Form 6, Form 8) సమర్పించే వెసులుబాటును ఎన్నికల కమిషన్ కల్పించింది. పొరపాటున తమ పేరు తొలగించబడిందని భావించే బాధితులు వెంటనే తమ పరిధిలోని బిఎల్ఓ లేదా నేరుగా voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా ధరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.

Share
Share