సూర్యాపేట, ఏపీబీ న్యూస్: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్‌పై సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ వేదికగా కాంగ్రెస్ పాలనను, సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని ఎండగడుతూ క్యాడర్‌కు దిశా నిర్దేశం చేశారు. ఓట్ల గల్లంతు ప్రక్రియపై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, మళ్లీ కేసీఆర్ ని ముఖ్యమంత్రిని చేసేంత వరకు ఎవరూ విశ్రమించవద్దని ఆయన పిలుపునిచ్చారు.
ధాన్యం కొనని దుర్మార్గపు ప్రభుత్వం – కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష
రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులపై జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ మాయమాటలను తీవ్రంగా తప్పుబట్టారు:
క్యాబినెట్ పెట్టి మరీ మోసం: రాష్ట్రంలో ప్రస్తుతం అత్యంత దుర్మార్గమైన ప్రభుత్వం నడుస్తోందని, క్యాబినెట్ మీటింగ్ పెట్టి మరీ వడ్లు కొనబోమని చెప్పిన దౌర్భాగ్య చరిత్ర ఈ ప్రభుత్వానిదేనని మండిపడ్డారు. సన్న వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి నమ్మించి మోసం చేశారన్నారు.
కేంద్రం పేరుతో బూచీ: కేంద్ర ప్రభుత్వాన్ని బూచీగా చూపిస్తూ ఇక్కడ ధాన్యం కొనకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పించుకుంటున్నారని ఆరోపించారు.
ఢిల్లీ వేదికగా కేసీఆర్ పోరాటం: ఆనాడు వడ్లు కొనమని కేంద్రం చెప్తే కేసీఆర్ గారు ఢిల్లీకి పోయి ధర్నాలు చేశారని, కేంద్రం కొనకపోయినా రాష్ట్ర రైతాంగం కోసం ప్రతి గింజనూ బిఆర్ఎస్ ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతును రాజుగా మార్చిందని గుర్తు చేశారు. చినుకు పడగానే నాగలి భుజాన వేసుకుని ధీమాగా ఎవుసం చేసుకునేలా నాడు భరోసా కల్పించామన్నారు.
రేవంత్ రెడ్డి ఒక హైబ్రిడ్ సీఎం – చంద్రబాబు నిలువెల్లా విషం
రాజకీయ విమర్శలను మరింత తీవ్రతరం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు రంగును జగదీష్ రెడ్డి ఈ సమావేశంలో బయటపెట్టారు:
హైబ్రిడ్ ముఖ్యమంత్రి: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నిలువెల్లా విషం నింపుకున్నాడని, ఆ చంద్రబాబు మరియు ప్రధాని నరేంద్ర మోడీల కలయికలో వచ్చిన ఒక ‘హైబ్రిడ్ ముఖ్యమంత్రి’ ఈ రేవంత్ రెడ్డి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ ఒక్కరే మొనగాడు: ఈ హైబ్రిడ్ శక్తుల పిచ్చి అణిచి, వీళ్ల ఆట కట్టించే ఏకైక మొనగాడు, ప్రజా నాయకుడు మన కేసీఆర్ మాత్రమేనని శ్రేణుల్లో జోష్ నింపారు.
గ్రామాల్లో అలజడులు: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి గ్రామాల్లో ప్రశాంతత కరువైందని, మళ్లీ పాత రోజుల్లాగా కొట్లాటలు, అలజడులు, గొడవలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం రైతులకు యూరియా కూడా ఇవ్వలేని చేతకాని సన్నాసి ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
ఆనాడు కడుపు కట్టుకొని ఆస్తులు పెంచాం – నేడు దోచుకుంటున్నారు
గత బిఆర్ఎస్ ప్రభుత్వ పారదర్శక పాలనను ప్రస్తుత కాంగ్రెస్ దోపిడీతో ఆయన పోల్చి చూపించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు కడుపు కట్టుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించామని, పాలన అంటే ఇట్లా ఉండాలి అని దేశం మొత్తం శభాష్ అనేలా కేసీఆర్ చేసి చూపించారన్నారు. తాము ప్రభుత్వ ఆస్తులు పెంచితే.. ఇవాళ కాంగ్రెస్ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు దొంగల్లా మారి రాష్ట్ర సంపద అంతా దోచుకొని దాచుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. సూర్యాపేట నియోజకవర్గానికి కాంగ్రెస్ నాయకులు మూసి మురికి నీరు అందించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంటే.. నాడు బిఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకంతో స్వచ్ఛమైన తాగునీరు అందించిందని గుర్తు చేశారు. మోసపోయామని రాష్ట్రంలోని ప్రతి ఒక్క వర్గం ఇవాళ బాధపడుతోందని, రేవంత్ రెడ్డి మాయాజాలాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.
ఆనాడు కడుపు కట్టుకొని ఆస్తులు పెంచాం.. నేడు దోచుకుంటున్నారు: మాజీ మంత్రి