బీఆర్ఎస్ లో ‘రెడ్డి’ చిచ్చు.. కేటీఆర్ ముందే హాట్ కామెంట్స్

  • చిరుమర్తిని అడ్డుకుంటున్నది ఎవరు?
  • ఎవరనే దాని పైన నకిరేకల్ బీఆర్ఎస్లో చర్చ
  • ఆలేరు, భువనగిరి, నాగార్జునసాగర్, కోదాడలో
  • ఇప్పటి నుంచే అడ్డుకట్టవేయాలన్న చిరుమర్తి

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇటీవల నల్లగొండలో జరిగిన సర్పంచ్ల సన్మాన సభలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పని చేస్తుంటే కొందరు పనికట్టుకుని కాళ్లలో కట్టెలు పెట్టే కార్యక్రమం చేస్తున్నారని, పార్టీలోనే ఉండి వివిధ రూపాల్లో తమను మోసం చేయాలని చూస్తున్నారని, అలాంటి వాళ్లను కట్టడి చేయాలని, లేదంటే పార్టీకి మరింత ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలోనే ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పార్టీలోనే ఉంటూ వెన్నుపోటు పొడుస్తున్న లీడర్లు రాష్ట్రంలో చాలా చోట్ల ఉన్నారని, కేటీఆర్ మొహమోటానికి పోకుండా వెంటనే చర్యలు చేపట్టాలని వేధిక పైనే కుండబద్దలు కొట్టిన వీడియో దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో జోరుగా వైరల్ అవుతున్నాయి.

నిజంగానే నకిరేకల్లో చిరుమర్తిని అడ్డుకుంటున్న ఆజ్ఞాత వ్యక్తి ఎవరు? ఇన్నాళ్లు ఎంతో ఓపిక పట్టిన చిరుమర్తి ఏకంగా కేటీఆర్ సమక్షంలోనే తీవ్రమైన వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమోచ్చింది? ఎమ్మెల్యే వేముల వీరేశం పైన నిప్పులు చెరిగిన చిరుమర్తి అదే సందర్భంలో సొంత పార్టీలో తమ లాంటి లీడర్ల పైన జరుగుతున్న మోసాన్ని ఇకనైనా కట్టడి చేయాలని లేదంటే భవిష్యత్తులో పార్టీనే నమ్ముకున్న మాలాంటి వాళ్లకు తీవ్రమైన నష్టం జరిగే ప్రమాదం ఉందని కేటీఆర్కు సూచించారు. ఈ వేధిక పైన ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో సహా, నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు. చిరుమర్తి ఎవరిని ఉద్దేశించి ఈ వ్యా ఖ్యలు చేసి ఉండొచ్చు? అనేది సస్పెన్స్గా మారింది. ఆయన చేసిన వ్యాఖలను లోతుగా పరిశీలిస్తే మాత్రం నకిరేకల్లో చిరుమర్తికి వ్యతిరేకంగా మరోవర్గాన్ని ప్రోత్సహిస్తున్నారని, అసెంబ్లీ ఎన్నికలప్పటి నుంచి మాజీ మంత్రి జగదీష్రెడ్డితో విభేదాలు వచ్చాయని, దాంతోనే నకిరేకల్కు రావడం కూడా మానేశారని చెపుతున్నారు. రాజకీయంగా చిరుమర్తిని ఇరకాటంలో పెట్టేందుకు జనం బలం లేని నాన్ లోక్ల్కు చెందిన మరోవర్గాన్ని ఎంకరేజ్ చేస్తున్నారని పార్టీ కేడర్ ఆరోపిస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ లీడర్లు బీఆర్ఎస్ కేడర్ పైన ఝులం ప్రదర్శించినప్పటికీ కనీసం పార్టీ తరపున ఎవరు స్పందించకపోవడంతో కేడర్ ఆందోళనలో పడింది.

భువనగిరి, కోదాడ, నాగార్జునసాగర్, ఆలేరు నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా మరోవర్గాన్ని రాజకీయంగా ఎంకరేజ్ చేస్తున్నారని, పార్టీలో వైరివర్గానికి ప్రయార్టీ ఎక్కువైందని మండిపడుతున్నారు. భువనగిరి చింతల వెంకటేశ్వరెడ్డి, నాగార్జునసాగర్లో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ఆలేరులో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ పార్టీ హైకమాండ్తో రిలేషన్స్ బలపడటానికి జిల్లా ముఖ్యనేతలే పరోక్షంగా సహరిస్తున్నారనేది మాజీల వాధన. పంచాయతీ ఎన్నికల్లో మాజీలు సహరించకపోయినప్పటికీ చాలా చోట్ల బీఆర్ఎస్ మద్ధతుదారులు గెలిచారని, అలాంటి వాళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మాజీల పైనే ఉందని, కానీ తెరవెనక జరుగుతున్న కుట్రల వల్ల ఆలోచించాల్సి వస్తోందని మాజీలు ఆందోళన చెందుతున్నారు.

Share
Share