మీసం తిప్పిన మాజీ మంత్రి కొడుకు​

సూర్యాపేట, ఏపీబీ న్యూస్: దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరు చెప్పగానే ఠక్కున గుర్తించేది మెలేసిన మీసంతో చెదరని చిరునవ్వుతో ఆకర్షణీయంగా ఉండే ఆయన ముఖచిత్రం. ఇప్పుడు అదే స్టైల్లో ఆయన కొడుకు రాంరెడ్డి సర్వోతమ్ రెడ్డి కొత్త లుక్తో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తండ్రి మరణానంతరం నియోజకవర్గంలో జరిగే శుభకార్యాలు, వేడకులకు సర్వోత్తమ్ హాజరవుతున్నారు. గతంలో తండ్రితో పాటు కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు సాదాసీ దాగా కనిపించే సర్వోత్తమ్ ఇప్పుడు కొత్తగా తండ్రి స్టైల్లో మెలేసిన మీసంతో న్యూలుక్తో ఫోటోలకు ఫోజులివ్వడం ఆకట్టుకుంటోందని ఆయన అనుచరగణం చర్చించుకుంటోంది.

Share
Share