- ఆగస్టు 9న పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో వైన్ షాపులు, బార్ల మూసివేత..
- పోలీస్ శాఖ కీలక ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, ఏపీబీ న్యూస్: హైదరాబాద్ నగరంలో బోనాల పండుగ వేడుకలను పురస్కరించుకుని శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా సైబరాబాద్/హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో మద్యం షాపులను మూసివేస్తున్నట్లు పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఆగస్టు 9వ తేదీన ఉదయం 10:00 గంటల నుండి రాత్రి 10:00 గంటల వరకు మద్యం విక్రయాలపై పూర్తి నిషేధం ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

మద్యం షాపులు మూసివేసే పోలీస్ స్టేషన్ల పరిధి:
- కూకట్పల్లి (Kukatpally)
- అల్లాపూర్ (Allapur)
- రాయదుర్గం (Raidurgam)
- జీడిమెట్ల (Jeedimetla)
- మేడ్చల్ (Medchal)
- చందానగర్ (Chandanagar)
ఈ నిబంధనలు సదరు పోలీస్ స్టేషన్ల పరిధిలోని వైన్ షాపులు, బార్లు, రెస్టారెంట్లతో పాటు పబ్లకు కూడా వర్తిస్తాయని, నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. బోనాల ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో ముగిసేందుకు నగర ప్రజలు, నిర్వాహకులు సహకరించాలని కోరారు.