- ఉమ్మడి జిల్లాలో బీసీ జనాభా 19.62 లక్షలు
- గ్రామాల్లో 13.82 లక్షలు, పట్టణాల్లో 5.80 లక్షలు
- రెండో స్థానంలో ఎస్సీలే 7.99 లక్షల మంది
- పట్టణాల్లో పెరుగుతున్న ఓసీ జనాభా
- ఎస్టీల జనాభా నామమాత్రం
- సామాజిక ఆర్ధిక కులగణన సర్వేలో నిగ్గుతేలని నిజాలు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఉమ్మడి జిల్లాలో బీసీల జనాభా టాప్లో ఉంది. మొత్తం 38.9 లక్షల జనాభాలో అత్యధికంగా బీసీలు 19,62,735 మంది ఉన్నారు. రెండో ప్లేస్లో ఎస్సీలు 7,99,902 మంది ఉండగా, ఓసీ జనాభా 5,50,995 మంది ఉన్నారు. ఎస్టీ జనాభా 5,01,075 మంది ఉన్నారు. అయితే పట్టణాల్లో ఓసీల జనాభా క్రమంగా పెరుగుతోంది. ఎస్సీల తర్వాత ఓసీలే పట్టణాల్లో ఎక్కువ మంది స్థిరపడుతున్నారు. ప్రధానంగా నల్లగొండ జిల్లాలోని పట్టణాల్లో ఓసీల జనాభా 1.10 లక్షల మంది ఉండగా, యాదాద్రి జిల్లాలో 80వేలు, సూర్యాపేట జిల్లాలో 75వేల మంది ఉన్నారు. గ్రామీణ జనాభాలో అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 6,15,509 మంది ఉండగా, రెండో ప్లేస్లో యాదాద్రి జిల్లాలోనే 3,86,267 మంది ఉండటం గమనార్హం.
ఎస్టీ జనాభా నల్లొండ జిల్లాలోనే గ్రామీణ ప్రాంతాల్లో 2,16,296 మంది ఉండగా, పట్టణాల్లో కేవలం 45 వేల మంది మాత్రమే ఉన్నారు. మూడు జిల్లాలోని పట్టణాల్లో ఎస్టీల జనాభా అత్యల్పంగా ఉందనే చెప్పాలి.
| కేటగిరీ | రూరల్ జనాభా | అర్బన్ జనాభా |
| ఎస్సీ (SC) | 5,64,902 | 2,35,000 |
| ఎస్టీ (ST) | 4,01,075 | 1,00,000 |
| బీసీ (BC) | 13,82,735 | 5,80,000 |
| ఓసీ (OC) | 2,85,995 | 2,65,000 |
నల్లగొండ జిల్లా జనాభా
గ్రామీణ జనాభా
| వర్గం | జనాభా |
| SC | 2,59,196 |
| ST | 2,16,296 |
| BC | 6,15,509 |
| OC | 1,23,237 |
| మొత్తం | 12,48,279 |
పట్టణ జనాభా (Approx)
| వర్గం | జనాభా |
| SC | 1,05,000 |
| ST | 45,000 |
| BC | 2,50,000 |
| OC | 1,10,000 |
| మొత్తం | 5,10,000 |
యాదాద్రి జిల్లాలో
గ్రామీణ జనాభా
| వర్గం | జనాభా |
| SC | 1,29,245 |
| ST | 50,575 |
| BC | 3,86,267 |
| OC | 72,335 |
| మొత్తం | 6,53,031 |
పట్టణ జనాభా (Approx)
| వర్గం | జనాభా |
| SC | 60,000 |
| ST | 20,000 |
| BC | 1,60,000 |
| OC | 80,000 |
| మొత్తం | 3,20,000 |
సూర్యాపేట జిల్లా
గ్రామీణ జనాభా
| వర్గం | జనాభా |
| SC | 1,76,461 |
| ST | 1,34,204 |
| BC | 3,80,959 |
| OC | 90,423 |
| మొత్తం | 8,17,316 |
పట్టణ జనాభా (Approx)
| వర్గం | జనాభా |
| SC | 70,000 |
| ST | 35,000 |
| BC | 1,70,000 |
| OC | 75,000 |
| మొత్తం | 3,50,000 |