APB News Exclusive: అక్రిడిటేషన్ కమిటీలో నెగ్గిన రెడ్లు..

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీలో రెడ్డి జర్నలిస్టులు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. రాష్ట్ర, జిల్లా రాజకీయాల్లో రెడ్లదే ఆధిపత్యం కాగా, తాజాగా జర్నలిస్టుల అక్రిడిటేషన్ కమిటీలో సైతం రెడ్డి జర్నలిస్టులే పైచేయి సాధించడం విశేషం. దీంతో జిల్లా జర్నలిజంలో రెడ్లకు తిరుగులేదని మరోసారి నిరూపించారు. నల్లగొండ జిల్లా రాజకీయాల్లో రెడ్లదే ఆధిపత్యం కావడంతో వారిని దారికి తెచ్చుకునేందుకు ప్రధాన ప్రతికలు అదే వర్గానికి చెందిన జర్నలిస్టులను బ్యూరోలుగా, స్టాఫర్లుగా నియమించడం ఆనవాయితీగా వస్తోంది. అదే పరంపర ఆ తర్వాత వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా శకం కొనసాగించింది. తెలంగాణ వచ్చాక కొత్త జిల్లాలు ఏర్పడ్డాక బీసీలకు చోటు దక్కింది. మళ్లీ ఈ పదేళ్లలో సోషల్ మీడియా, డిజిటల్ యుగం మొదలవడంతో బీసీల్లోని కొన్ని కులాలకు, ఎస్సీలు జర్నలిస్టులుగా చలామణి లోకి వచ్చారు, కానీ వీళ్లలో నిజంగా ఎంత మంది అర్హులైన జర్నలిస్టులు ఉన్నారు.. అనేది విచారిస్తే తప్పా నిజం వెలుగులోకి రాదు. కానీ ప్రెస్ క్లబ్ లు, జర్నలిస్టు సంఘాలు తమ ఉనికి కోసం నాలుగు లైన్ల వార్త కూడా రాయడం చేతగానీ, రోడ్ల పైన ఆవారా తిరుగుతున్న వాళ్లను జర్నలిస్టులు అని ముద్ర వేసి, అక్రిడిటేషన్ లైసెన్స్ లు ఇస్తున్నారు. కొత్తగా నియమించిన అక్రిడిటేషన్ కమిటీ నిజంగానే అర్హులకు న్యాయం చేయాలని భావిస్తే ముందుగా అక్రమ జర్నలిస్టులను గుర్తించి ఏరివేయాల్సిన బాధ్యత కమిటీ పైనే ఉంది.

నల్లగొండలో జర్నలిస్టుల మధ్య విభేదాలు రెండు క్లబ్ ల ఏర్పాటుకు దారి తీశాయి. ఒక క్లబ్ కు బీసీలు, ఇంకో క్లబ్ కు రెడ్ల పెత్తనం నడుస్తోంది. ఈ రెండు క్లబ్ లకు ఒకేపార్టీకి చెందిన ఇద్దరు నాయకులు చెరొక క్లబ్ కు అండగా నిలిచారు. క్లబ్ ల ఏర్పాటుకు అవసరమయైన ఆర్ధిక సాయం చేశారు. కానీ కాలక్రమేణ క్లబ్ ల నిర్వహణ భారంగా మారింది. ఎవరైనా దయతలచి ప్రెస్ మీట్ లు పెట్టి వందో, రెండొందలు ఇస్తే తప్పా ఆఫీసుల ఖర్చులు కూడా వెళ్లదీయలేని దీనస్థితిలో ఉన్నాయి. రెండేళ్ల క్లబ్ వల్ల లాభం ఎవరికి జరిగింది? అంటే రెడ్డి వర్గానికే. అక్రిడిటేషన్ కమిటీలో ఒకటే క్లబ్ నుంచి ఇద్దరు రెడ్లుకు అవకాశం లభించింది. ప్రధాన ప్రతికకు చెందిన మరొక బ్యూరో ఇన్చార్జి కూడా రెడ్డినే. ఈ లెక్కన పెద్ద పత్రికల తరపున రెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా నుంచి రెడ్డికే అవకాశం కల్పించారు. నిజానికి పెద్ద పేపర్లలో బీసీ బ్యూరోలు, ఎలక్ట్రానిక్ మీడియాలో బీసీ, ఎస్సీ జర్నలిస్టులు కమిటీల్లో అవకాశం ఇవ్వాలని కలెక్టర్, డీపీఆర్వో(DPRO)ను కోరారు, కానీ స్టేట్ లీడర్ల ఒత్తిడికి తలొగ్గిన పౌరసమాచార శాఖ రెడ్లకే పచ్చజెండా ఊపింది. ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరించే వీ6, డిజిటిల్ పేపర్లో టాప్లో ఉన్న దిశ బ్యూరోల పేర్లను కూడా పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం.

మండలంలో కనీసం పది కాపీలు కూడా లేని పేపర్లను పెద్ద పత్రికల జాబితాలో చేర్చారు. మీడియం, స్మాల్ పత్రికల జాడ కూడా కనిపించదు, కానీ పెద్ద పత్రికల ముసుగులో ఉన్న పేపర్లకు, భారీ సర్యూలేషన్ ఉన్న పేపర్ల తో సమానంగా అక్రిడిటేషన్లు ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది. అసలు మీడియం పేపర్లలో అయితే ఖాళీగా రోడ్ల పైన తిరుగుతున్న వ్యక్తులకు స్టేట్, జిల్లా కార్డులు ఇవ్వడం మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ కార్డులను అడ్డంపెట్టుకుని రియల్ ఎస్టేట్, ఇల్లీగల్ దందాల్లో తల దూర్చడం, బ్యూరోలు, స్టాఫర్లను ప్రసన్న చేసుకోవడం తప్పా సమాజానికి వీళ్ల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని చెప్పొచ్చు. పాత కమిటీ ఈ అక్రమాల పైన కలెక్టర్ సమక్షంలో నిలదీసింది. అప్పుడున్న డీపీఆర్వో పెద్ద పత్రిక లతో అంటకాగి, తాగుడుకు, డబ్బులకు తలొగ్గి అక్రమాలకు తలలూపారు. అప్పుడున్న కలెక్టర్ సీరియస్ కావడంతో డీపీఆర్వో ఫైల్ ను బయట పెట్టకుండా ఆఫీసులో పెట్టి తాళం వేసుకుని పరారయ్యాడు. కలెక్టర్ ఆదేశాల మేరకు డీపీఆర్వో ఆఫీసు తాళం పగలగొట్టి ఫైల్ తెప్పించడం అక్రమాలకు కళ్లెం పడింది. మరి ఈ కమిటీ కూడా సాహోసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటుందా.. లేదా అన్నది వేచి చూడాల్సిందే.

Share
Share