- సీఎం రేవంత్‌కు చదువు రాదు.. వచ్చే ఎన్నికల్లో బొంద ప్రభుత్వానికి ఘోర పరాజయం తప్పదు: ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు!
- తెలంగాణలో కింద మీద చేసి అయినా లీగల్‌గా బీజేపీని అధికారంలోకి తెస్తాం!
- దొంగ ఇసుక లారీలు దొరుకుతాయి కానీ.. రైతు ధాన్యం రవాణాకు లారీలు దొరకవా?
- దేశంలోనే ఫాల్తూ నంబర్ 1 సీఎం రేవంత్ రెడ్డి.. ఎఫ్‌సీఐ (FCI) కి ₹32 లక్షల టన్నుల బకాయి!
భువనగిరి/యాదాద్రి, ఏపీబీ న్యూస్: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ (M.P. Dharmapuri Arvind) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భువనగిరి మండలం సురేంద్రపురి (Surendrapuri) లో జరుగుతున్న బీజేపీ అంతర్గత శిక్షణ తరగతుల్లో పాల్గొన్న ఆయన.. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అత్యంత ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ బ్రదర్స్‌కు మింగడంలో ఉన్న శ్రద్ధ రైతులపై లేదు:
రాష్ట్రంలో సాగుతున్న ధాన్యం సేకరణ, లారీల కొరతపై ఎంపీ అరవింద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధాన్యం రవాణా విఫలం: రాష్ట్రంలో అక్రమంగా తిరిగే దొంగ ఇసుక లారీలు ప్రభుత్వానికి ఈజీగా దొరుకుతాయి కానీ, కొనుగోలు కేంద్రాల్లో రైతులు పండించిన ధాన్యాన్ని రవాణా చేయడానికి లారీలు దొరకవా అని ప్రశ్నించారు.
రైతులపై నిర్లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్స్‌కు అక్రమంగా “మింగడంలో” ఉన్న చిత్తశుద్ధి.. ఎండలో ఎండిపోతున్న అమాయక రైతులపై లేదని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రభుత్వం ఎఫ్‌సీఐ (FCI) కి ఇంకా 32 లక్షల టన్నుల ధాన్యం బకాయి ఉందని గుర్తుచేశారు. ఇకపై ధాన్యం కొనుగోళ్ల గురించి రేవంత్ రెడ్డి మాట్లాడితే దవడ రాలగొట్టాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో బీజేపీ గెలవడం చాలా ఈజీ:
రాష్ట్రంలో రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అరవింద్ ధీమా వ్యక్తం చేశారు.
లీగల్‌గా కింద మీద చేస్తాం: తెలంగాణలో లీగల్‌గా కింద మీద చేసి అయినా సరే.. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగురవేస్తామన్నారు. త్రిపుర, వెస్ట్ బెంగాల్ వంటి రాష్ట్రాల కంటే తెలంగాణలో బీజేపీ గెలవడం చాలా ఈజీ అని విశ్లేషించారు.
మోదీ చేరిష్మా మార్చడంలో విఫలం: పార్టీలో అంతర్గతంగా నేతల మధ్య స్వల్ప అభిప్రాయబేధాలు ఉండటం సహజమేనని, అయితే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్, చేరిష్మాను పూర్తి స్థాయిలో ఓట్లుగా మార్చుకోవడంలో రాష్ట్ర నాయకత్వం కొంత విఫలమైందని ఆయన స్వయంగా అంగీకరించారు.
మీనాక్షి నటరాజన్ వివాదం – కాంగ్రెస్ కుట్ర:
రాజ్యసభ ఎన్నికల వేళ కాంగ్రెస్ సీనియర్ నేత మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణలో కేసులు ఉన్నాయంటూ వస్తున్న ప్రచారంపై ఎంపీ అరవింద్ స్పందించారు. ఆ కేసుల వెనుక అసలు రేవంత్ రెడ్డి కుట్ర ఉందా? లేక కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుట్ర ఉందా అనేది వాళ్లే తేల్చుకోవాలని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనీస చదువు రాదని, దేశంలోనే ఆయన ఒక ‘ఫాల్తూ నంబర్ 1 సీఎం’ అని అరవింద్ ఘాటుగా విమర్శించారు. రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఒక “బొంద ప్రభుత్వం” నడుపుతున్నాడని, వచ్చే ఎన్నికల్లో ఆయన ఘోరంగా ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు.
Breaking News:దేశంలోనే చదువురాని, ఫాల్తూ నెంబర్ 1 సీఎం రేవంత్ రెడ్డి: ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు