APB News Exclusive: మిర్యాలగూడెం కొత్త డీఎస్పీ(DSP) రాక పై ఉత్కంఠ!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: మిర్యాలగూడ కొత్త డీఎస్పీ రాక పైన తీవ్ర ఉత్కంఠ నెలకొంది. శాంతిభద్రతలు అదుపు తప్పిన మిర్యాలగూడ డివిజన్ ను రక్షించేందుకు కొత్తగా వచ్చే డీఎస్పీ పైన సామాన్య ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. సీఐ, ఎస్ఐల పని తీరు బాగోలేదని, స్థానిక అధికార పార్టీ లీడర్లతో అంటగాకుతున్నారని, మిర్యాలగూడలో రౌడీషీటర్ల ఆగడాలు మితిమిరిపోయానే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇల్లీగల్ దందా పైన ఉక్కుపాదం మోపే ఆఫీసర్ రావాలని మిర్యాలగూడ, నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు. తాజా, మాజీ డీఎస్పీ రాజశేఖరరాజు అడ్డు తొలగించుకుంటే ఇక తమకు తిరుగులేదని భావిస్తున్న లీడర్లు.. ఆనంద్ రెడ్డి వస్తున్నారని తెలిసి మరింత ఆందోళనకు గురియ్యారు. పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టుగా ఆనంద్ రెడ్డి వస్తే ఇక తమ ఆటలు సాగవని భావించిన కొందరు లీడర్లు ఆయన రాకను అడ్డుకునేందుకు గట్టిగానే పై స్థాయిలో ప్రయత్నిస్తున్నారు. రెడ్డి సామాజికవర్గం బలంగా ఉన్న మిర్యాలగూడెం లో అదే వర్గానికి చెందిన డీఎస్పీ వస్తుండంటే ఎవరైనా తెగ సంబర పడతారు. కానీ మిర్యాలగూడెం, నాగార్జునసాగర్ లో పరిస్థితులు ఎమ్మెల్యేల చేతులు కూడా దాటిపోయాయని తెలిసింది. దాంతో ఆనంద్ రెడ్డి లాంటి ఆఫీసర్ వస్తే అందరికీ మేలు జరుగుతుందని భావించి పై స్థాయిలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ నెల 20 ఇంటెలిజెన్స్ లో పనిచేస్తున్న ఆనంద్ రెడ్డిని, మిర్యాలగూడకు, అక్కడ పనిచేస్తున్న రాజశేఖరరాజును సీఐడీ విభాగానికి బదిలీ చేశారు. కానీ పది రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆనంద్ రెడ్డి విధుల్లో చేరకపోవడంతో కొత్త అనుమానాలకు తావిచ్చినట్లైంది. గతంలో మిర్యాలగూడ, హాలియా సీఐగా, దేవరకొండ డీఎస్పీగా పని చేసిన ఆనంద్ రెడ్డి విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహారిస్తారనే పేరు ఉంది. కాగా, రాజశేఖరరాజు బదిలీ కాగానే సెలవు పైన వెళ్లారు. కొత్త డీఎస్పీ వస్తే ఆయన సీఐడీలో విధుల్లో చేరాల్సి ఉంది. అయితే ఆనంద్ రెడ్డికి బదులు మరొక కొత్త ఆఫీసర్ను, తమకు అన్ని విధాలుగా సహరించే ఆఫీసర్ను రప్పించేందుకు రూలింగ్ పార్టీ లీడర్లు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది.

Share
Share