- రైతు భరోసా ఎప్పుడు వేస్తారు అని రెడ్లే ఎదురుచూస్తున్నరు.
- మన కులంలో కటిక పేదలను ఆదుకోవాలి: మండలి చైర్మన్ గుత్తా
నల్లగొండ, ఏపీబీ న్యూస్: ఊళ్లలో రెడ్లు బాగుంటేనే ఆ ఊళ్లో అన్ని కులాలు బాగుంటాయని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండలో రాజా బహదూర్ వెంకటరామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. రెడ్డి కులంలో కటిక పేదరికంలో బాధపడుతున్న వాళ్లను ఆదుకోవాలని ఆయన సూచించారు. వాళ్లలో పేద విద్యార్థులకు ఆర్ధిక సాయం అందించాలని తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరైన కార్యక్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఊళ్లలో రైతుభ రోసా ఎప్పుడు వేస్తారు అని రెడ్డిలే ఎదురుచూస్తున్నారని, రెడ్లు బాగుంటేనే అన్ని కులాలు బాగుంటాయని చెప్పడానికి ఇదే నిదర్శమని అన్నారు.

రాష్ట్రంలో నేటి ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, గత ప్రభుత్వం చేసిన అప్పులు వడ్డీలు కట్టి మళ్లీ కొత్త అప్పులు తెస్తేనే రాష్ట్రం నడిచేలా ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధికి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డిలు అహర్నిశలు శ్రమిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య, మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, గుమ్మల మోహన్ రెడ్డి, వెంకటరామిరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు మూల దయాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఊరుకొండ ప్రభాకర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.