ఘనంగా మంత్రి కో..మటిరెడ్డి వెంకటరెడ్డి బర్త్ డే వేడుకలు.. శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

నల్లగొండ బ్యూరో, ఏపీబీ న్యూస్: నల్లగొండ జిల్లా అగ్రనేత, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదిన వేడుకలు శనివారం మినిస్టర్ క్వార్టర్స్తో పాటు జిల్లా కేంద్రంలో పండుగ వాతావరణాన్ని తలపించాయి. రాజకీయ, అధికారిక ప్రముఖులు మంత్రికి ప్రత్యేకంగా కలిసి బొకేలు అందించి, శాలువాలతో ఘనంగా సత్కరించారు.

హైదరాబాద్లోని మంత్రి నివాసంలో ఉదయం నుంచే శుభాకాంక్షలు తెలిపేందుకు నేతలు క్యూ కట్టారు. నల్లగొండ పార్లమెంట్ సభ్యులు (MP) రఘువీర్ రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి కోమటిరెడ్డిని కలిసి బర్త్డే గ్రీటింగ్స్ తెలియజేశారు.

వీరితో పాటు తెలంగాణ విజయ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఆమీర్, అబ్బగోని రమేష్, ప్రముఖ కాంగ్రెస్ నాయకులు వంగాల అనిల్ రెడ్డి, అల్లి మల్లికార్జున్, అల్లి సుభాష్ యాదవ్ తదితరులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన అభినందనలు అందజేశారు.

మరోవైపు నల్లగొండ జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర శాసనమండలి సభ్యులు (MLC) శంకర్ నాయక్, మేయర్ బుర్రి చైతన్య, మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, గుమ్మల మోహన్ రెడ్డి, అబ్బగోని రమేష్ గౌడ్, వంగాల అనిల్ రెడ్డి తదితరులు క్యాంప్ ఆఫీసులో కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, నల్లగొండ జిల్లాను ప్రగతిపథంలో నడిపించాలని ఆకాంక్షించారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తెలంగాణ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సంఘం ముఖ్య నాయకులు బి. యాదయ్య, సందీప్ రెడ్డి తదితరులు మంత్రిని కలిసి నల్లగొండ జిల్లా అభివృద్ధిలో, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ఆయన అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదిన వేడుకలకు ఈ స్థాయిలో ప్రముఖులు, ప్రజాప్రతినిధులు తరలిరావడం ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో ఆయనకున్న పట్టుకు, ప్రజాదరణకు నిదర్శనం. అటు హైదరాబాద్, ఇటు నల్లగొండ అనే తేడా లేకుండా ఉమ్మడి జిల్లా నేతలంతా ఏకతాటిపైకి వచ్చి మంత్రికి శుభాకాంక్షలు తెలపడం కాంగ్రెస్ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ‘ఏపీబీ న్యూస్’ తరఫున గౌరవ మంత్రివర్యులకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

Share
Share