అక్రమ రిజిస్ట్రేషన్ల అసలు కథను దారిమళ్లించే ప్రయత్నం
రికార్డుల మాయాజాలంతో నిజాలను మసకబార్చే కుట్ర
ఒకే సర్వే నంబర్లోని భూములను మాయం చేసిన ఘనులు
కలెక్టర్ ను తప్పుతోవ పట్టించే నివేధికకు పక్కా స్కెచ్
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ కార్పొరేషన్ పరిధిలోని కతాలగూడ భూముల వ్యవహారంలో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కోట్ల రూపాయల విలువైన భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై విచారణ జరుగుతున్నప్పటికీ, అసలు అక్రమాలను బయట పెట్టాల్సిన రెవిన్యూ అధికారులే వ్యవహారాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రికార్డులను తారుమారు చేస్తూ, ఒకే సర్వే నంబర్లో ఉన్న భూములను మాయం చేసిన వాస్తవాలను దాచిపెట్టి, ఉన్నతాధికారులకు తప్పుదారి పట్టించే నివేదిక పంపేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది.
ఆధారాలు మాయం చేసే కుట్ర..
భూముల రిజిస్ట్రేషన్లలో అక్రమాలు జరిగినట్లు రెవిన్యూ రికార్డులే స్పష్టంగా చెబుతున్నప్పటికీ, ఆ ఆధారాలను మాయం చేసేందుకు కొందరు అధికారులు రంగంలోకి దిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జరిగిన అక్రమాల బాధ్యత తమపై పడకుండా తప్పించుకునేందుకు ఏకంగా 13 ఏళ్ల నాటి రికార్డులను తారుమారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. సర్వే నంబర్లు 504, 505లో ఉన్న 12.50 గుంటల చెరువు బాట భూమిని రియల్టర్లకు అక్రమంగా అప్పగించిన వ్యవహారం ఇప్పటికే వెలుగులోకి వచ్చినప్పటికీ, చర్యలు తీసుకోవాల్సిన అధికారులే ఈ వ్యవహారంలో వివాదాస్పద పాత్ర పోషిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సర్వే నంబర్ 504లో మొత్తం ఎకరం 34 గుంటల భూమి ఉండగా, అందులో ఎకరం 28.5 0 గుంటలకే పట్టా ఉంది. మిగిలిన 5.50 గుంటలు 30 అడుగుల చెరువు బాటలో భాగంగా ఉంది. అలాగే సర్వే నంబర్ 505లో మొత్తం ఎకరం 26 గుంటల భూమి ఉండగా, రైతులకు ఎకరం 19 గుంటలకే పట్టా ఉంది. మిగిలిన 7గుంటలు చెరువు బాటలో భాగం. ఈ రెండు సర్వేనంబర్లలో కలిపి 12.50 గుంటల ప్రభుత్వ భూమిని మిస్సింగ్ సర్వే నంబర్ల పేరుతో రిజిస్ట్రేషన్ చేసిన విషయాన్ని ఏపీబీ న్యూస్ ఇప్పటికే ఆధారాలతో సహా వెలుగు లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
ఇళ్ల జాగల పేరుతో కొత్త డ్రామా..
అయితే ఈ వ్యవహారంపై లోతైన విచారణ జరిపి అక్రమాల మూలాలను బయటపెట్టాల్సిన రెవిన్యూ అధికారులు, ఇదే భూమిని 13 ఏళ్ల క్రితమే ఇళ్ల స్థలాలుగా విక్రయించారని, ఎలాంటి డబుల్ రిజిస్ట్రేషన్లు జరగలేదని వాదించడం అనుమానాలకు తావిస్తోంది. అక్రమ రిజిస్ట్రేషన్ల అసలు వాస్తవాలను మరుగున పరచి, బాధ్యులను కాపాడేందుకు రికార్డుల తారుమారుకు పాల్పడుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2013 -14లోనే 504, 505 సర్వే నంబర్ లో పజ్జూరి ఇంద్రయ్య పేరు మీద ఉన్న 12.50 గుంటల వ్యవసాయ భూమిని ఇళ్ల జాగల పేరుతో ముగ్గురికి విక్రయించినట్టు రెవిన్యూ రికార్డుల్లో ఉందని ఆఫీసర్లే చెపుతున్నారు. మధు సూధన్ రెడ్డికి 5 గుంటలు, ఎల్లమ్మకు 5 గుంటలు, మరొకరికి 2.50 గుంటల చొప్పున విక్రయించారు. గుంటల రూపంలో విక్రయించాల్సిన వ్యవసాయ భూములను అప్పట్లో అధికారుల పుణ్యామాని గజాల రూపంలో రిజిస్ట్రేషన్లు చేయడంతో ఇళ్ల జాగల కింద రికార్డుల్లోకెక్కాయి. ఈ మేరకు రికార్డుల్లో ముగ్గురి పేర్ల మీద (అమెండ్మెంట్) సవరణ కూడా జరిగిపోయింది. అప్పటి నుంచి ఇంద్రయ్య పేరు మీద రెవిన్యూ రికార్డుల్లో సెంటు భూమి కూడా లేదని అధికారులే చెప్తున్నారు. కానీ ఈ ఏడాది ఏప్రిల్ 19న ఇంద్రయ్య పేరుతో అవే 504, 505 సర్వేలో ఆకస్మాత్తుగా మరో 12.50 గుంటల జాగ ఎక్కడ నుంచి పుట్టకొచ్చింది అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఈ రిజిస్ట్రేషన్ చేసిన భూమి ఫీల్డ్ లో ఎక్కడ ఉందో ఆఫీసర్లు ఇప్పటి వరకు గుర్తించలేకపోయారు. కలెక్టర్ విచారణకు ఆదేశించి నెల రోజులు దాటినా, ఆ భూమి ఆచూకీ ఏమిటి? రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది? అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారు.
అధికారులు, రియల్టర్లు కుమ్మక్కు..
ఇదే సర్వే నంబర్ లో కొత్తవెంచర్ ఏర్పాటు చేస్తున్న రియల్టర్ల కన్ను చెరువు బాట పైన పడింది. దీంతో 30 ఫీట్ల బాటను 20 ఫీట్లకు కుదించి, మిగితా జాగను వెంచర్ లో కలుపుకునేందుకు అధికారుల అండదండలతో ఇంద్రయ్య అనే వ్యక్తిని మళ్లీ తెరపైకి తెచ్చారు. పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తిని ఎప్పుడో విక్రయించిన ఇంద్రయ్యకు ఈ ఏడాది ఏప్రిల్ 19న ఆకస్మాత్తుగా 12.50 గుంటల భూమి రిజిస్ట్రేషన్ కావడం అనేక అనుమానాలకు తావిస్తోంది. సర్వే నంబరు 504/ఈ4 లో 5.50 గుంటలు, ఖాతా న బరు 61128, పీపీబీ(PPB)నం : టీ28200, 505/ఆ2లో 4.50గుంటలు, పీపీబీ(PPB)నం : 28200 భూ భారతి చట్టం కింద ఆఫీసర్లు పాసుపుస్తకం ఇష్యూ చేశారు. ఈ రిజిస్ట్రేషన్ జరగడానికి సరిగ్గా నాలుగు రోజుల ముందు కొందరు బాధితులు కతాలగూడలో భూముల అక్రమాలు జరుగుతున్నాయని తహాశీల్దార్ కు ఫిర్యాదు కూడా చేశారు. కానీ అవేమీ పట్టించుకోకుండా ఏప్రిల్ 19న 10 గుంటలకు ఇంద్రయ్యకు రిజిస్ట్రేషన్ చేశారు. అయితే ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో కంగుతిన్న అధికారులు దాన్ని నుంచి బయటపడేందుకు అడ్డదారులు వెతుక్కుంటున్నారు.
గండం నుంచి గట్టేక్కేందుకు మంతనాలు..
ఇంద్రయ్య ఇళ్ల జాగల పేరుతో రిజిస్ట్రేషన్ చేసిన 12.50 గుంటల జాగ చెరువు బాట జాగే అని నిరూపించేందుకు ఆఫీసర్లు అడ్డ దారులు తొక్కుతున్నారు. 2013-14లో ఇంద్రయ్య రిజిస్ట్రేషన్ చేసిన ముగ్గురితో రహస్య మంతనాలు జరుపుతున్నారు. అప్పుడు మీకు చేసిన రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ చేసుకుంటే మళ్లీ ఇప్పుడు కొత్తగా అవే భూముల్లో మీకు రిజిస్ట్రేషన్ చేస్తామని, తద్వారా మిస్సింగ్ సర్వే నంబర్ పేరుతో చేసిన 12.50 గుంటల జాగ ఇదేనని రికార్డుల్లోకి ఎక్కిస్తే గండం నుంచి బయట పడొచ్చని అధికారులు కొత్త ప్లాన్. కానీ దీనికి అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆ ముగ్గురు అంగీకరించలేదని తెలిసింది. పైగా ముగ్గురి పేర్ల మీద రికార్డుల్లో అమెండమెంట్ కూడా జరిగిందని, ఆ భూమిని ఇప్పుడు కొత్త వెంచర్ లో డెవలప్మెంట్ కింద ఇచ్చామని మధు సూధన్ రెడ్డి ఏపీబీ ప్రతినిధితో చెప్పారు.
ఫ్లో లో జరిగిపోయింది.. సరిచేస్తున్నాం: పరుశరాం : తహాశీల్దార్, నల్లగొండ.
504, 505 సర్వేలో డబుల్ రిజిస్ట్రేషన్లు జరగలేదు. కానీ 2013-14లో ఇళ్ల జాగల కింద రిజిస్ట్రేషన్ చేశారు. అప్పుడు అదంతా ఫ్లో లో జరిగింది. వాటిని సరిచేస్తున్నాం. అక్కడ ప్రభుత్వ భూమి లేదని తేలింది. ఇతర సర్వే నంబర్లలో కూడా ఎంక్వైరీ జరుగుతోంది. 2013-14లో ఇంద్రయ్య భూమిని గజాల రూపంలో ముగ్గురికి విక్రయించిన సంగతి వాస్తవమే.
APB News Exclusive: ఎపిసోడ్ -6: కతాలగూడ భూముల్లో.. విచారణకు వక్రబాట!