రేపే మెగా హెల్త్ క్యాంప్.. రివర్ నిమ్స్‌లో ఉచిత కిడ్నీ పరీక్షలు..

నల్లగొండ, ఏపీబీ న్యూస్: నల్లగొండలోని రివర్ నిమ్స్ ఆసుపత్రిలో రేపు (ఆదివారం) ఉచిత కిడ్నీ తనిఖీ శిబిరాన్ని నిర్వహించనున్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధులపై అవగాహన కల్పించేందుకు మరియు ముందస్తు గుర్తింపు కోసం Fourrts సంస్థ సహకారంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ తూఫ్రాన్ సమత ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ హెల్త్ క్యాంప్కు వచ్చే బాధితులకు మరియు సాధారణ ప్రజలకు ఈ క్రింది పరీక్షలను పూర్తిగా ఉచితంగా చేస్తారు:

  • బ్లడ్ ప్రెజర్ (BP)
  • బ్లడ్ షుగర్ (Sugar)
  • హీమోగ్లోబిన్ (Hb)
  • క్రియాటిన్ (Creatinine) – కిడ్నీ పనితీరును తెలిపే కీలక పరీక్ష
  • సీ యూఈ (Urine Test)
  • బీఎంఐ (BMI) మరియు శరీర బరువు (WT) పరీక్షలు.
  • సమయం: ఆదివారం ఉదయం 7:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు మాత్రమే.
  • వేదిక: రివర్ నిమ్స్ ఆసుపత్రి, నల్లగొండ.

కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారు, అలాగే బీపీ, షుగర్ ఉన్నవారు కిడ్నీల ఆరోగ్యంపై ఆందోళన ఉంటే ఈ శిబిరానికి హాజరై నిపుణుల సలహాలు పొందవచ్చు. కుటుంబ సభ్యులు అందరూ ఈ ఉచిత వైద్య పరీక్షల అవకాశాన్ని వినియోగించుకోవాలని డాక్టర్ తూఫ్రాన్ సమత కోరారు.

Share
Share