- చీఫ్ స్పేక్స్పర్సన్గా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సౌరవ్ దాస్ నియామకం
- రచయిత, ఫిలిం మేకర్ విజేత దహియా.. ఐఐటీ కాన్పూర్ అల్యూమినస్ అశుతోష్ రంకా చేరిక.
- NEET, CBSE పేపర్ లీకేజీలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్.
న్యూఢిల్లీ, ఏపీబీ న్యూస్: ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్తో దూసుకుపోతున్న సాటిరికల్ యువజన వేదిక ‘బొద్దింక జనతా పార్టీ’ (CJP) తమ మీడియా, పబ్లిక్ కమ్యూనికేషన్స్ టీమ్ను బలోపేతం చేసింది. జూన్ 6న దేశ రాజధానిలో నిర్వహించబోయే నిరసనల కంటే ముందే ముగ్గురు జాతీయ స్థాయి ప్రతినిధుల పేర్లను పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే అధికారికంగా ప్రకటించారు.
నిజమైన ప్రతినిధుల ప్రొఫైల్స్ ఇవే:
సౌరవ్ దాస్ (చీఫ్ స్పేక్స్పర్సన్): ఈయన ప్రముఖ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. చట్టపరమైన, సామాజిక సమస్యలపై లోతైన కథనాలు రాసిన అనుభవం ఉంది. గతంలో నవంబర్ 2025లో ఇండియా గేట్ వద్ద జరిగిన యాంటి-పొల్యూషన్ (కాలుష్య నిరోధక) నిరసనలకు నాయకత్వం వహించిన వారిలో ఈయన ఒకరు.
విజేత దహియా: ఈయన పొలిటికల్ రీసెర్చర్, రచయిత మరియు చలనచిత్ర నిర్మాత. ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ (DTU) పూర్వ విద్యార్థి అయిన విజేత.. ప్రముఖ యూట్యూబ్ క్రియేటర్ ధృవ్ రాఠీ బృందంలో రీసెర్చ్ వర్క్ చేశారు. రెండు హర్యానా చిత్రాలకు డైరెక్షన్ కూడా చేశారు.
అశుతోష్ రంకా: ఈయన ఐఐటీ కాన్పూర్ (IIT Kanpur) మరియు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (LSE) పూర్వ విద్యార్థి. ప్రపంచ ప్రఖ్యాత కన్సల్టింగ్ సంస్థ ‘మెకిన్సే & కంపెనీ’ (McKinsey & Company) లండన్ బ్రాంచ్లో కన్సల్టెంట్గా పనిచేశారు. 2025లో భారత్కు తిరిగి వచ్చి జైపూర్లో పర్యావరణ, విద్యా సంబంధిత ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు.
జూన్ 6 నిరసనల అజెండా ఏమిటి?
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన NEET పేపర్ లీకేజ్, అలాగే CBSE మరియు CUET పరీక్షలలో జరిగిన అక్రమాలకు నిరసనగా ఈ ఉద్యమం సాగుతోంది.
మంత్రి రాజీనామా డిమాండ్: ఈ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జూన్ 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసన చేపట్టనున్నారు.
మద్దతుగా నిలిచిన సోనమ్ వాంగ్చుక్: ఈ నిరసనకు ప్రముఖ పర్యావరణ వేత్త, క్లైమేట్ యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్చుక్ కూడా మద్దతు ప్రకటించారు. జూన్ 5 లోపు ప్రభుత్వం స్పందించకపోతే తానూ జూన్ 6న ఢిల్లీలో ఈ నిరసనలో పాల్గొంటానని ఆయన ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు.