Big Breaking News: పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.. కాసేపట్లో మేడ్చల్ మేజిస్ట్రేట్ ముందుకు..

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన బండి భగీరథ్ పోక్సో (POCSO) కేసు తుది అంకానికి చేరుకుంది. శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో నిందితుడు బండి భగీరథ్ స్వయంగా సీపీ (కమిషనర్ ఆఫ్ పోలీస్) కార్యాలయానికి వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

మరోవైపు ఈ కేసులో చట్టపరమైన ప్రక్రియను పోలీసులు వేగవంతం చేశారు. మేడ్చల్ మేజిస్ట్రేట్ ఎదుట బాధితురాలితో పాటు ఆమె తల్లి వాంగ్మూలాలను (164 CrPC Statement) న్యాయస్థానం నమోదు చేసింది.

40 నిమిషాల పాటు విచారణ: మేజిస్ట్రేట్ ఛాంబర్లో దాదాపు 40 నిమిషాల పాటు బాధితురాలు, ఆమె తల్లి కోర్టుకు అసలేం జరిగిందనే వివరాలను వివరించారు.

ఇప్పటికే రెండుసార్లు స్టేట్మెంట్స్: పోలీసులు ఇప్పటికే బాధితురాలి నుంచి రెండు సార్లు వివరాలను సేకరించి వాంగ్మూలం నమోదు చేయగా, ఇప్పుడు మేజిస్ట్రేట్ ముందు రికార్డైన స్టేట్మెంట్ ఈ కేసులో అత్యంత కీలకంగా మారనుంది.

సిపి ఆఫీసులో లొంగిపోయిన బండి భగీరథ్ను పోలీసులు ప్రస్తుతం రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. వైద్య పరీక్షల అనంతరం కాసేపట్లోనే నిందితుడిని మేడ్చల్ మేజిస్ట్రేట్ నివాసంలో లేదా కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. న్యాయమూర్తి నిందితుడికి రిమాండ్ విధిస్తారా లేదా అన్నది మరికొద్ది సేపట్లో తేలనుంది.

కేంద్ర మంత్రి కుమారుడు కావడం, బాధితురాలు మైనర్ కావడంతో ఈ కేసుపై యావత్ రాష్ట్రం కళ్ళు కప్పి ఉంచింది. రాజకీయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, పోలీసులు బాధితురాలి వాంగ్మూలాలను మేజిస్ట్రేట్ ముందు పక్కాగా నమోదు చేయించడం మరియు నిందితుడు లొంగిపోవడం చూస్తుంటే కేసు వేగంగా క్లైమాక్స్కు చేరుతోందని అర్థమవుతోంది.

Share
Share