అంబుజా సిమెంట్స్, అదానీ ఫౌండేషన్.. దేవాపూర్ గిరిజన పాఠశాలకు కొత్త శోభ..

దేవాపూర్, ఏపీబీ న్యూస్: ప్రపంచవ్యాప్తంగా నిర్మాణ సామగ్రి పరిష్కారాలను అందిస్తున్న ప్రముఖ సంస్థ, అదానీ గ్రూప్లో భాగమైన ‘అంబుజా సిమెంట్స్’ (Ambuja Cements), తన సామాజిక బాధ్యత విభాగం ‘అదానీ ఫౌండేషన్’ (Adani Foundation) తో కలిసి తెలంగాణలోని దేవాపూర్ గిరిజన గ్రామంలో గ్రామీణ విద్యాభివృద్ధికి సరికొత్త ఊపిరి ఊదింది. దేవాపూర్లోని గిరిజన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఎంపీపీఎస్ గట్రావుపల్లి (MPPS Gatraupally) లో మౌలిక సదుపాయాలను సమగ్రంగా మెరుగుపరుస్తూ విద్యార్థులకు సురక్షితమైన, పారిశుధ్యంతో కూడిన అనుకూల అభ్యాస వాతావరణాన్ని అందుబాటులోకి తెచ్చింది.

మొత్తం 28 మంది గిరిజన విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతున్న ఈ ప్రాథమిక పాఠశాల చాలా కాలంగా సరైన నీటి నిల్వ వసతులు లేక, చుట్టూ రక్షణ ప్రహరీ లేక, అనుకూల మౌలిక సదుపాయాల కొరతతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది. ఈ ప్రతికూల పరిస్థితులు తరగతి గది బోధనతో పాటు మధ్యాహ్న భోజన (Mid-day Meal) నిర్వహణ, విద్యార్థుల పారిశుధ్యంపై తీవ్ర ప్రభావం చూపేవి.

ఈ తీవ్ర సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించిన అంబుజా సిమెంట్స్ మరియు అదానీ ఫౌండేషన్ తక్షణమే రంగంలోకి దిగి పలు అభివృద్ధి పనులను చేపట్టాయి.

ప్రహరీ గోడ నిర్మాణం: పాఠశాల ప్రాంగణానికి చుట్టూ భద్రత కలిపిస్తూ సురక్షితమైన ప్రహరీ గోడను నిర్మించారు.

కాంక్రీట్ ఫ్లోరింగ్: వర్షాకాలంలో నీరు నిలవకుండా, దుమ్ము ధూళి లేకుండా ప్రాంగణమంతా కాంక్రీట్ ఫ్లోరింగ్ ఏర్పాటు చేశారు.

ప్రత్యేక వంటశాల నిర్మాణం: విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని అత్యంత పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణంలో వండేందుకు ప్రత్యేక వంటశాలను నిర్మించి అందుబాటులోకి తెచ్చారు.

కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కింద చేపట్టిన ఈ లక్ష్యబద్ధమైన పెట్టుబడుల వల్ల పాఠశాలలో మౌలిక వసతులు మెరుగుపడటమే కాకుండా విద్యార్థుల హాజరు శాతం గణనీయంగా పెరిగింది. వాతావరణంలో ఎలాంటి మార్పులు వచ్చినా అంతరాయం లేకుండా ఉపాధ్యాయులు పాఠాలు బోధించగలుగుతున్నారు. పాఠశాలలో రక్షణ, పరిశుభ్రత పెరగడంతో తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను బడికి పంపేందుకు పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.

తమ కార్యకలాపాల పరిసర ప్రాంతాల్లోని సామాజిక, విద్యా సంబంధిత మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా అంబుజా సిమెంట్స్, అదానీ ఫౌండేషన్లు ఈ ప్రాజెక్ట్ను విజయవంతంగా పూర్తి చేశాయి.

Share
Share