- మూడు నెలల ముచ్చటే..
- ఖమ్మం జిల్లాలో విషాదం..
- సమాజం ఎటు పోతుంది?
ఖమ్మం బ్యూరో, ఏపీబీ న్యూస్: ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో తీవ్ర విషాదకరమైన సంఘటన వెలుగుచూసింది. పెళ్లయిన కేవలం మూడు నెలలకే భార్య, ఆమె కుటుంబ సభ్యుల మానసిక వేధింపులు, అవమానాలు భరించలేక ఓ యువకుడు కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. “నీకు మగతనం లేదు” అంటూ పెళ్లయిన మూడో రోజు నుంచే భార్య వేధించడం, అత్తగారింట్లో అందరి ముందు అవమానించడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.
పెళ్లయిన మూడో రోజు నుంచే నరకం
రఘునాథపాలెం మండలం రాంక్యాతండాకు చెందిన సదర్ లాల్ (27) అనే యువకుడు తన తండ్రితో కలిసి మేకల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ ఏడాది మే నెలలో హర్యాతండాకు చెందిన యువతితో అతనికి వివాహమైంది.
మగతనం లేదంటూ నిందలు: పెళ్లి జరిగిన మూడో రోజు నుంచే నీకు మగతనం లేదంటూ సదర్ లాల్ను భార్య మానసికంగా వేధించడం మొదలుపెట్టింది.
పండుగ వేళ అత్తగారింట్లో అవమానం: ఇటీవల జరిగిన సీత్లా పండుగ సందర్భంగా సదర్ లాల్ తన అత్తగారింటికి వెళ్లాడు. అక్కడ భార్య, ఆమె కుటుంబ సభ్యులు కలిసి అందరి ముందు అతన్ని దారుణంగా అవమానించారు.
బావకు లాస్ట్ ఫోన్ కాల్: తీవ్ర మనస్తాపానికి గురైన సదర్ లాల్.. తన అక్క ఇంటికి వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి బయలుదేరాడు. దారిలో తన బావకు ఫోన్ చేసి తాను చనిపోతున్నానని చెబుతూ ఫోన్ లొకేషన్ షేర్ చేశాడు.
ట్విస్ట్: పెళ్లికి ముందే అఫైర్.. మెడికల్ టెస్టులు చేసినా వినలేదు
సదర్ లాల్ ఆత్మహత్యపై అతని కుటుంబ సభ్యులు సంచలన విషయాలు బయటపెట్టారు. పెళ్లికి ముందే ఆ యువతి వేరే వ్యక్తితో ప్రేమలో ఉందని, పెళ్లయిన తర్వాత కూడా ఆ లవ్ ఎఫైర్ కొనసాగించడానికే సదర్ లాల్పై ఇలాంటి తప్పుడు నిందలు వేసిందని ఆరోపించారు. మగతనం లేదంటూ భార్య గొడవ పెట్టడంతో.. తాము సదర్ లాల్కు మెడికల్ టెస్టులు (Medical Tests) కూడా చేయించామని, అందులో అంతా నార్మల్గా ఉన్నట్లు నివేదికలు వచ్చినా భార్య తరపు వారు వినకుండా పంచాయతీలు పెట్టి వేధించారని కన్నీరుమున్నీరయ్యారు. బావ ఇచ్చిన సమాచారంతో వి. వెంకటాయపాలెం కాలువ వద్దకు వెళ్లి చూడగా, అక్కడ సదర్ లాల్ బైక్, ఫోన్, కలుపు మందు డబ్బా లభించాయి. పోలీసుల సాయంతో కాలువలో గాలింపు చర్యలు చేపట్టి సదర్ లాల్ మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు కేసును లీగల్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు.