Breaking News: ముర్కుల చేతిలో తెలంగాణ.. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

నల్లగొండ, ఏపీబీ న్యూస్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రంలో రాజకీయ రాజేవు తీవ్రమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అజ్ఞానానికి, ఆయనకు రాష్ట్రంపై ప్రేమ లేకపోవడానికి నేటి ఉదంతమే నిదర్శనమని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అవతరణ దినోత్సవ వేడుకల్లో ఎండ కొడుతుందని కేవలం 10 నిమిషాల్లోనే ప్రసంగాన్ని ముగించుకుని వెళ్లిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అని ఆయన ఆరోపించారు.

జగదీష్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టారు.

ప్రసంగించలేని దౌర్భాగ్యం: “ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పది నిమిషాలు కూడా వేదికపై నిలబడి ప్రసంగించలేని దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. ఇది రేవంత్ రెడ్డి అజ్ఞానానికి నిదర్శనం. ఆయనకు అసలు ‘జై తెలంగాణ’ అనడమే ఇష్టం ఉండదు.. రాష్ట్రంపై రవ్వంత కూడా ప్రేమ లేదు” అని విమర్శించారు.

చివరి ఛాన్స్: “ఇంతటితో మా పని లాస్ట్.. మళ్లీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదనే విషయం రేవంత్ రెడ్డికి కూడా అర్థమైపోయింది. ఇలాంటి వారిని నమ్మి రాష్ట్రాన్ని ఏ ముర్కుల చేతిలో పెట్టామో ప్రజలు అర్థం చేసుకోవాలి” అని వ్యాఖ్యానించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఉద్యోగాల కల్పన, ఆర్థిక ప్రగతిని జగదీష్ రెడ్డి రికార్డులతో సహా వివరించారు:

కోటి ఉద్యోగాలు: కేసీఆర్ తన అద్భుత పాలనతో ప్రత్యక్షంగా, పరోక్షంగా రాష్ట్రంలో దాదాపు కోటి ఉద్యోగాలను సృష్టించారని స్పష్టం చేశారు.

విద్యుత్ శాఖలోనే 30 వేలు: తాను గతంలో నిర్వహించిన ఒక్క విద్యుత్ విభాగంలోనే 30 వేల ఉద్యోగాలను నిరుద్యోగులకు అందించామని గుర్తుచేశారు.

ఇండస్ట్రియల్ పాలసీ: దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానం (TS-iPASS) ద్వారా కేసీఆర్ 20 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు.

సాగుభూమి రికార్డు: తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో కేవలం 1.20 కోటి ఎకరాల సాగుభూమి ఉంటే.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే దాన్ని అదనంగా మరో కోటి ఎకరాలు పెంచి, మొత్తం 2.10 కోట్ల ఎకరాలకు చేర్చామని.. దీనివల్ల పరోక్షంగా 50 లక్షల మందికి ఉపాధి దొరికిందని వివరించారు. కేసీఆర్ హయంలో రాష్ట్ర జీఎస్డీపీ (GSDP) రూ.3 లక్షల కోట్ల నుండి ఏకంగా రూ.15 లక్షల కోట్లకు చేరిందని గర్వంగా ప్రకటించారు.

“కృష్ణా, గోదావరి నదుల నీళ్లను తెచ్చి సురక్షితంగా ఇంటింటికీ తాగునీరు, సాగునీరు అందించిన ఘనత కేసీఆర్దే. గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ కేవలం ఆరు గంటల కరెంటే ఇస్తున్నారు. కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చిన చరిత్ర మాది. ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కేసీఆర్ ప్రవేశపెట్టిన ఒక్క ప్రజా సంక్షేమ పథకమైనా ఉందా?” అని జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ గురించి మాట్లాడుకోవడమే ఈ రెండు పార్టీలకు ఇష్టం ఉండదని ఆరోపించారు.రాకేష్ రెడ్డి తెచ్చిన ‘యాప్’ అభినందనీయం: అన్ని రకాల పరీక్షలకు సంబంధించిన డౌట్స్, సిలబస్కు ఒకే చోట పరిష్కారం దొరికేలా రాకేష్ రెడ్డి రూపొందించిన సరికొత్త యాప్ను జగదీష్ రెడ్డి అభినందించారు. కేవలం 15 రోజుల్లోనే కాక్రోచ్ లాంటి యాప్కు 15 కోట్ల మంది ఫాలోవర్స్ రావడం అంటే.. అది ప్రభుత్వాల పట్ల ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతకు, విముఖతకు నిదర్శనమన్నారు. నిరుద్యోగ యువత ఈ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని, అలాగే ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సాగే పోరాటాల్లో యువత, నిరుద్యోగులు ఎప్పుడూ ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు.

Share
Share