APB News Exclusive: నల్లగొండ ఐసీడీఎస్(ICDS) లో.. రచ్చకెక్కిన కోల్డ్ వార్..

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో అధికారులు, ఉద్యోగులకు మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ రచ్చకెక్కింది. ఫ్యాన్ లు, ట్యూబ్ లైట్ ల కొనుగోళ్లలో చోటుచేసుకున్న అక్రమాల బాగోతం ఇరువర్గాల మధ్య కొత్త చిచ్చురేపింది. నాసిరకమైన మెటీరియల్ సప్లై చేయడం పైన ఏపీబీ న్యూస్(APB News) లో కొద్దిరోజుల క్రితం పరిశోధానాత్మక కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. దీని పైన స్పందించిన జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణకు ఆదేశించారు. అక్రమాలకు కారుకుడైన సీనియర్ అసిస్టెంట్ డెప్యుటేషన్ క్యాన్సిల్ చేసి, నకిరేకల్ సీడీపీఓ(CDPO) ఆఫీసుకు సరెండర్ చేసినట్టు తెలిసింది. ఇదే క్రమంలో సప్లై చేసిన మెటీరియల్ నాణ్యతను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించినట్టు తెలిసింది, కానీ సీడీపీఓలు మాత్రం విచారణ తప్పుతోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు.

సప్లై చేసిన మెటీరియల్ అంతా కరెక్ట్ గానే ఉన్నట్టు రిపోర్ట్ ఇవ్వమని సూపర్వైజర్ల పైన ఒత్తిడి తెస్తున్నారు. ఆఫీసులో మితిమీరిపోయిన అక్రమాలు ఎక్కడ బయట పడ్తాయనే ఆందోళనతో ఇటు ఉద్యోగులు, అటు ఆఫీసుర్లు ఇక్కడి నుంచి బదిలీ అయ్యేందుకు పైస్థాయిలో ప్రయత్నాలు స్పీడప్ చేశారని తెలిసింది. జిల్లా కలెక్టర్ మినరల్ ఫండ్స్తో సప్లై చేసిన 20 లక్షల మెటరీయల్లో సుమారు రూ.10 లక్షలు గోల్ మాల్ జరిగిందని, ఈ అక్రమాలు నిజమని తేలితే ఎక్కడ తమ పైన వేటు పడుతుందోననే భయంతో గత రెండు రోజుల నుంచి ఐసీడీఎస్ ఆఫీసర్లు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఎంక్వైరీ రిపోర్ట్లో అవినీతి జరగలేదని, అంతా సవ్యంగా ఉన్నాయని ఇవ్వాలని సీడీపీఓల ద్వారా సూపర్వైజర్ల పైన ఒత్తిడి పెంచినట్టు ప్రచారం జరుగుతోంది.

Share
Share