NHAI చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ తో మంత్రి కోమటి రెడ్డి భేటీ

  • రాష్ట్రంలోని పలు NHAI ప్రాజెక్ట్స్ పై చర్చించిన మంత్రి

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) ఛైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ తో రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆదివారం హైదరాబాద్ లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రీజినల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ – విజయవాడ(NH-65) విస్తరణ పనులు ప్రారంభం పై ప్రత్యేకంగా చర్చించారు. నిత్యం యాక్సిడెంట్స్ తో డెత్ రోడ్ గా పిలువబడుతున్న హైదరాబాద్ – విజయవాడ రహదారి 8లేన్ విస్తరణ పనులు వీలైనంత త్వరగా చేపట్టాలని కోరారు. ఇదే రహదారిలో ఎల్బీనగర్ నుండి హయత్ నగర్ వరకు నాగపూర్ తరహాలో 7.1కి.మీ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి, డిపీఆర్ MoRTH కు పంపిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు.

హైదరాబాద్ – విజయవాడ, రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం టెండర్ ప్రక్రియ పూర్తి చేసి అతి త్వరలో పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు NHAI ఛైర్మన్ మంత్రికి వివరించారు. రాష్ట్రంలో NHAI ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న,చేపట్టబోయే పలు ప్రాజెక్టుల అంశాలు ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కీలక భాగస్వామ్యంగా నిలిచే ప్రాజెక్టులు త్వరగా పూర్తయేలా చూడాలని NHAI ఛైర్మన్ ను మంత్రి కోరారు. మంత్రి వెంట రోడ్లు, భవనాలు శాఖ స్పెషల్ సిఎస్(CS) వికాస్ రాజ్, ప్రత్యేక కార్యదర్శి ప్రావిణ్య, NHAI రీజినల్ ఆఫీసర్ శివ శంకర్, ఆర్ అండ్ బి సిఈ(CE) లు ధర్మారెడ్డి, రాజేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Share
Share