హైడ్రాను ప్రజలంతా కోరుకుంటున్నారు: కమిషనర్ ఏవీ రంగనాథ్

నల్గొండ, ఏపీబీ న్యూస్: ప్రజలంతా హైడ్రాను కోరుకుంటున్నారని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. నగర ప్రజలే కాదు ఇతర పట్టణాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా హైడ్రా లాంటి వ్యవస్థ ప్రతి రాష్ట్రంలో ఉండాలని కోరుకుంటున్నారన్నారు. నల్గొండలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరయిన సందర్భంగా అక్కడ విలేకరులు హైడ్రా కమిషనర్ ను కలసి హైడ్రా కార్యక్రమాలపై ఆరా తీశారు. చాలా మంది HYDRAAను విస్తరించాలని కోరుతున్నారని కమిషనర్ పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం మా పరిధి ORR వరకే ఉంటుందన్నారు. ప్రజల నుంచి HYDRAAకు మంచి పాజిటివ్ స్పందన వస్తోంది. ఇతర జిల్లాల ప్రజలు కూడా “మాకు HYDRAA కావాలిఅని కోరుతున్నారు.

BJP మాజీ వైస్ ప్రెసిడెంట్ HYDRAA లాంటి సంస్థ ముంబైలో కూడా అవసరమని ఒక ఆర్టికల్ రాశారు అని చెప్పారు. ముందుగా నిర్మాణాత్మక అభివృద్ధి వైపు వెళ్తాం. దాదాపు 25 చెరువులను అభివృద్ధి చేస్తాం. అలాగే 5 ఎకరాలు, 10 ఎకరాల చిన్న చెరువులను CSR ద్వారా అభివృద్ధి చేస్తాం. చెరువుల పునరుద్ధరణ ఒక ఎత్తయితే వాటి ఆక్రమణలను తొలగించడం పెద్ద టాస్క్ అని పేర్కొన్నారు. ఏడాదిన్నరలో 2,100 ఎకరాల భూమిని కాపాడడం సాధారణ విషయం కాదని కర్ణాటక బృందం చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. చెరువుల పునరుద్ధరణ ఎలా చేపడుతున్నారో తెలుసుకోవడానికి తాము బెంగళూరు వెళ్తే, ఆక్రమణలు తొలగించి చెరువులను అభివృద్ధి చేయడం ఎలానో ఇక్కడకు వచ్చి కర్ణాటక మున్సిపల్ బృందాలు తెలుసుకునే పనిలో పడ్డాయని చెప్పారు.

ఇటీవల చెన్నై నుంచి కూడా అధికారుల బృందం చెరువుల అభివృద్ధిని, వర్షాకాలంలో హైడ్రా పనితీరుని అధ్యయనం చేసిందన్నారు.చెరువుల పునరుజ్జీవన కార్యక్రమాల్లో ఇళ్లు కోల్పోయిన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేశారు.

Share
Share