- భార్య మృతి తట్టుకోలేక భర్త హఠాన్మరణం.
- ఉదయం ఆమె.. మధ్యాహ్నం అతను.
- మాధవరంలో శోక సంద్రమైన ప్రజానీకం
- నల్లగొండ జిల్లాలో ఘటన
శాలిగౌరారం, ఏపీబీ న్యూస్: భార్య భర్తలు అంటే ఒకరికొకరు తోడు, నీడ అని వారి మధ్యనున్న ప్రేమ, ఆప్యాయత అనురాగమే, మీరు చచ్చినా బ్రతికినా మీతోనే అని భార్య భర్తలు ఒకరిపై ఒకరు తమపై నున్న ప్రేమను అప్పుడప్పుడు వెలిబుచ్చుతుండటం పరిపాటే. సరిగ్గా ఇటువంటి హృదయ విషాదకర ఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం మాధవరం (కలాన్)గ్రామంలో చోటు చేసుకుంది.
మామిడి ముత్తమ్మ (73)శనివారం ఉదయం 6 గంటలకు అనారోగ్యంతో మృతి చెందింది, కాగా ఆమె మృతిని చూసి తట్టుకోలేని భర్త మామిడి సైదులు(79) 5 గంటల వ్యవధిలోనే అనగా సుమారు ఉదయం 11 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు, బంధువులు స్థానిక వైద్యుడుని తీసుకురాగా పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు.దీనితో కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించగా ఆ గ్రామంలో అయ్యో పాపం అంటూ కన్నీరు మున్నీరు అయ్యారు. కాగా ఆ దoపతులకు కలిగిన ఏకైక కుమార్తె యాదమ్మ వారికి తలకొరివి పెట్టారు.