హైదరాబాద్, ఏపీబీ న్యూస్: మునుగోడు MLA రాజగోపాల్ రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. కేబినెట్ రేస్, రాజకీయ గుర్తింపు చర్చల నేపథ్యంలో ఆయన తన జీవిత లక్ష్యం, రాజకీయ నిబద్ధత గురించి భావోద్వేగంగా మాట్లాడారు. అధికారం అడ్డుపెట్టుకుని కోట్లు దోచుకునేవారిని కంట్రోల్ చేసి, పేదలకు సేవ చేయడమే తన ధ్యేయమని స్పష్టం చేశారు.
వీడియోలో రాజగోపాల్ రెడ్డి: కీలక వ్యాఖ్యలు
“నాకు 59 ఏళ్లు.. జీవితంలో మెజారిటీ భాగం పూర్తయింది. మిగిలిన సమయంలో కోట్లాది మంది ప్రజలకు సేవ చేస్తా”.. MP, MLA ను ఎక్కడి నుంచైనా అయితా నాకది ముఖ్యం కాదు.. నేను సెల్ఫ్ మేడ్, దొంగ దారిలో రాలేదు, కష్టపడి వచ్చాను. అధికారం అడ్డం పెట్టుకుని కోట్లు దోచుకునే వారిని కంట్రోల్ చేసి, వారి నుంచి పేదలకు డబ్బులు పంచేలా చేసి చనిపోతా” –రాజగోపాల్ రెడ్డి
కేబినెట్ రేస్ చర్చల మధ్య వీడియో
తెలంగాణ కేబినెట్ రీషఫుల్ అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో ఈ వీడియో వచ్చింది. రాజగోపాల్ రెడ్డి కేబినెట్ బెర్తు కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి వివాదంలో ఉంది. ఈ సందర్భంలో వచ్చిన ఈ వీడియో తన రాజకీయ లక్ష్యం పదవి కోసం కాదు, సేవ కోసం అనే సందేశం ఇస్తున్నట్లు కనిపిస్తోంది.
విశ్లేషణ: రాజగోపాల్ రెడ్డి వీడియో రాజకీయంగా తెలివైన చదరంగం. కేబినెట్ రేస్లో ఉన్నప్పుడు ‘పదవి ముఖ్యం కాదు, సేవ ముఖ్యం’ అని చెప్పడం ఒక వైపు public sympathy, మరోవైపు పార్టీ నాయకత్వంపై soft pressure. ‘సెల్ఫ్ మేడ్’ అనే మెసేజ్ అన్న కోమటిరెడ్డి వివాదానికి indirect reference గా చదవవచ్చు. 59 ఏళ్ల వయసులో మిగిలిన సమయంలో సేవ చేయాలన్న భావన నిజంగా ఉంటే.. పదవి వచ్చినా రాకపోయినా ఆ నిబద్ధత కొనసాగాలి.