Big Breaking News: మున్సిపల్ పోరులో ముదిరిన ఉద్రిక్తత: నల్లగొండ, సూర్యాపేటలో రాజకీయ వర్గాల ఘర్షణ!

నల్లగొండ, ఏపీబీ న్యూస్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పర్వం నేడు  పలుచోట్ల ఉద్రిక్తతలకు దారితీసింది. ముఖ్యంగా నల్లగొండ కార్పొరేషన్ మరియు సూర్యాపేట జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదాలు, భౌతిక దాడులు చోటుచేసుకోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

నల్లగొండ కార్పొరేషన్ పరిధిలో ప్రధాన పార్టీల మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొంది.

32వ వార్డు: ఇక్కడ కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లను ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలతో ఇరువర్గాలు పరస్పరం నిందలు వేసుకున్నాయి.

10వ వార్డు: ఈ వార్డులో కాంగ్రెస్ మరియు బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Municipal Elections in Nalgonda Suryapet

సూర్యాపేట జిల్లాలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది.

గాంధీనగర్ (13వ వార్డు): ఇక్కడ తీన్మార్ మల్లన్న నేతృత్వంలోని టీఆర్పీ (తెలంగాణ రైట్ పార్టీ) మరియు కాంగ్రెస్ కార్యకర్తలు భౌతిక దాడులకు దిగారు. పరస్పరం కర్రలతో దాడులు చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి.

పోలీసుల తీరుపై నిరసన: పోలీసులు అకారణంగా తమపై లాఠీచార్జ్ చేశారని ఆరోపిస్తూ బాధితులు సూర్యాపేట – జనగామ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీనివల్ల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.

భువనగిరి మున్సిపాలిటీలో ఓటర్లకు బహిరంగంగా నగదు పంపిణీ చేస్తున్నారంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద నగదు పంపిణీని అడ్డుకునే క్రమంలో స్వల్ప ఘర్షణలు జరిగాయి.

చండూరు, చౌటుప్పల్, తిరుమలగిరి మరియు మోత్కూరు మున్సిపాలిటీల్లోనూ ఉద్రిక్తత నెలకొంది. నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ బూత్ల వద్ద ప్రచారం చేస్తున్నారంటూ అభ్యర్థులు రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదులు చేశారు.

Share
Share