- రాజకీయాల పట్ల ఆసక్తిలేకున్నా ప్రజాక్షేత్రంలోకి తల్లిబిడ్డలు
- జనంపల్లి జనాల ప్రోద్బలంతోనే సర్పంచ్ పదవి
- మా అల్లుడు శ్రీను సైతం జనంపల్లి కోసం కష్టపడ్తడు
- నా బిడ్డకు మేయర్ అవకాశం రావడం గర్వకారణం
- మంత్రి కోమటిరెడ్డి అండదండలతోనే ఇంతటి గొప్పఛాన్స్
- మేయర్ అభ్యర్థి ప్రచారానికి తరలివచ్చిన జనంపల్లి సేన
- సకుటుంబ సమేతంగా చైతన్య గెలుపు కోసం ప్రచారం
- ఏపీబీ ప్రతినిధితో చైతన్య తల్లి సర్పంచ్ బండ సరోజ చిట్‌చాట్
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ‘నా పేరు బండ సరోజ, నా భర్త అంజిరెడ్డి. రామన్నపేట మండలం జనంపల్లి, మాది వ్యవసాయ కుటుంబం, రాజకీయాలు అంటే అంతగా ఆసక్తి లేని నన్ను జనంపల్లి జనాలు సర్పంచ్గా గెలిపించిర్రు. ఇప్పుడు నల్లొండ మేయర్గా నా బిడ్డ చైతన్యకు అవకాశం రావడం గర్వకారణం, మా కుటుంబం మీద నమ్మకంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిగారు ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నా బిడ్డ గెలుపు కోసం జనంపల్లి నుంచి జనం అంతా నల్గొండకు తరలివచ్చిర్రు. అని చైతన్య తల్లి సరోజ ఏపీబీ ప్రతినిధితో ముచ్చటించారు.

తండ్రి బాటలోనే బిడ్డ
చైతన్య నాన్న అంజిరెడ్డికి రాజకీయాల అంటే ఆసక్తి, ఎప్పుడో 20 ఏళ్ల క్రితం జనంపల్లి సర్పంచ్గా పోటీ చేసి కొద్ది తేడాతో ఓడిపోయిర్రు. స్వాతంత్ర సమర యోధుడు మనోహర్ పంతులుగారు గెలిచిర్రు. మళ్లీ ఇన్నేళ్లకు ఆయన వారసురాలిగా చైతన్యకు ఇంతట పెద్ద బాధ్యత మంత్రిగారు అప్పగించారు. గతంలో రామాలయం చైర్మన్గా, కౌన్సిలర్గా పనిచేసింది, కానీ అప్పుడు ఆమె వెనక భర్త శ్రీనివాస్ రెడ్డి ఉన్నడు, మేయర్గా ఒంటిరిగానే రాజకీయక్షేత్రంలో కి అడుగుపెట్టింది.
శ్రీను, చైతన్య బావమరదళ్లు
మా కుటుంబం మొదటి నుంచి కాంగ్రెస్సే, కానీ రాజకీయాల పట్ల ఏ నాడు ఆసక్తిలేదు. నేను, నాబిడ్డ అనుకోకుండానే రాజకీయ క్షేత్రం లోకి అడుగుపెట్టాం. చైతన్య ఇంటర్ వరకు చదివింది. ఏడో తరగతి వరకు రామన్నపేట మండలం జనంపల్లిలోనే చదవింది, ఆ తర్వాత ఇంటర్ వరకు హైదరాబాద్లో, ఇంటర్ అయ్యాక పెళ్లిచేశాం. శ్రీను, చైతన్య బావమరదళ్లు, మేనరికం. నా భర్త అంజిరెడ్డి గారి చిన్ననాన్న వాళ్ల మనవడు మా అల్లుడు శ్రీను. నాకు ఇద్దరు కూతుళ్లు పెద్ద కూతురు చైతన్య, రెండో కుమార్తె అమెరికాలో స్థిరపడింది. మా కుటుంబం తోనే గడపటం అంటేనే ఇష్టం.

జనంపల్లి జనాల కోరిక మేరకు
మా అల్లుడు శ్రీనివాస్ రెడ్డి పుట్టింది, పెరిగింది జనంపల్లిలోనే, వాళ్లది సొంతం గుర్రంపోడు మండలం లక్ష్మీదేవిగూడెం, కానీ శ్రీనువాళ్ల అమ్మమ్మది జనంపల్లి, దాంతోనే జనంపల్లితో ఆయనకు అవినాభావ సంబంధం ఉంది. శ్రీను రాజకీయాల్లో బిజీగా ఉన్నందున వాళ్ల పిల్లల దగ్గర నేను ఉండేదాన్ని. ఇద్దరు మనవళ్లు అమెరికా వెళ్లిపోవడంతో హైదరాబాద్ నుంచి జనంపల్లికి వచ్చేశాం. పంచాయతీ ఎన్నికలు రావడంతో జనంపల్లి జనాల కోరిక మేరకు నిలబడాల్సి వచ్చింది.

మా అల్లుడు శ్రీను సపోర్ట్
జనంపల్లి జనాలు సైతం శ్రీను వెంట ఉంటరు. ఎప్పుడు ఏ ఆపద వచ్చినా, పనిపడ్డా శ్రీను వద్దకే వస్తుంటరు. అదే చొరవతో జనంపల్లి జనరల్ మహిళ కాగానే నన్ను నిలబెట్టేందుకు శ్రీను వద్దకు వెళ్లి ఒత్తిడి చేశారు. శ్రీనివాస్ రెడ్డి జనంపల్లి కోసం సొంత ఖర్చులతో వీధి లైట్లు ఏర్పాటు చేసిండు, ఎస్సీ కాలనీల్లో వాటర్ ప్లాంట్లు పెట్టించిండు. అదే అభిమానంతో సర్పంచ్ ఎన్నికల్లో నన్ను ఏకగ్రీవం చేస్తామని బీఆర్ఎస్, కాంగ్రెస్ హామీ ఇవ్వడంతో ఒప్పుకున్నాం. బీజేపీ పోటీ చేసింది. ఎన్నికల్లో 430 ఓట్ల మెజార్టీతో గెలిచిన.
నాబిడ్డ మేయర్ అనగానే భయపడింది
నల్లగొండ మేయర్ జనరల్ మహిళ అయితదని, నా బిడ్డకు అవకాశం వస్తదని ముందే తెలిసుంటే సర్పంచ్గా పోటీ చేసేదాన్ని కాదు. కుటుంబ బాధ్యతలు కూడా చూసుకోవాల్సి ఉంటది. నా బిడ్డకు మేయర్ పదవి అనగానే ఒకింత ఆందోళన చెందింది, అంత పదవి నేనొక్కదాన్నే చేయలేను, శ్రీనివాస్ రెడ్డిని కూడా పోటీ చేయమని కోరింది, కానీ ఇద్దరం పోటీ చేయడం బాగుండదు, ఏం కాదులే అని ధైర్యం చెప్పిండు. గతంలో కౌన్సిలర్గా ఉన్నప్పుడు కూడా అన్ని బాధ్యతలు శ్రీనివాస్ రెడ్డే చూసుకుండు. కానీ ఇప్పుడు శ్రీను లేకుండా మేయర్ బాధ్యతలు ఒంటరిగా మోయడం కష్టమని కంగారుపడ్డది.

చైతన్య చాలా మృదుస్వభావి
చైతన్య చాలా మృదుస్వభావి, పూజలు ఎక్కువగా చేస్తది, చాలా చురుగ్గా వ్యవహారిస్తది. వాళ్ల నాన్నగారి లెక్కనే జనంతో ఎక్కుగా కలిసేందుకు ఇష్టపడదు. రాజకీయాల పట్ల ఆసక్తి చూపదు, కానీ పెళ్లి అయ్యాక మా అల్లుడు శ్రీను రాజకీయాల్లోకి వచ్చాక ఇంటికి వచ్చిపోయే జనాలతో మాట్లాడటం మొదలైంది. వాళ్ల అత్త సునంద కూడా పట్టణంలో స్నేహితులు, పరిచయస్తులు ఉన్నందున చైతన్య జనంలోకి వచ్చింది.