- బుర్రి చైతన్య సంతకం పెడితే బోలెడన్నీ నిధులు
- ఈ మూడు వార్డుల్లో ఉన్నదంతా బందువులు, స్నేహితులే
- ఈ ఎన్నికలు రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతాయ్
- మోహన్ రెడ్డి పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిండు: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఎవరైనా పడనోళ్లు కుట్ర చేస్తరని నల్లగొండ కార్పోరేషన్ కాకుండా అడ్డు పడతరని రహస్యంగా ఉంచిన, అసెంబ్లీలో చట్టం అయ్యేవరకు ఎవరికీ చెప్పలేదు. ఎవరైనా పడనోళ్లు నల్లగొండను ఎందుకు మహా నగరంగా చేస్తున్నావ్ అని ఉత్తరాలు రాస్తరనే అనుమానంతో ఎక్కడా లీక్ చేయలేదు, అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ఆదివారం నల్లగొండలో 32, 24,13 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుర్రి చైతన్యరెడ్డి, గుమ్మల జానకి, ఏదుళ్ల శ్రీధర్ రెడ్డి పోటీచేస్తున్న వార్డుల్లో ఓటర్లు అందరు బందువులు, స్నేహితులే ఉన్నారని, భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

బుర్రి చైతన్య మేయర్ అయితే ఒక్క సంతకం పెడితే
బుర్రి చైతన్య మేయర్ అయితే ఒక్క సంతకం పెడితే బోలెడన్నీ నిధులు వస్తాయని, ఆమె వార్డుల్లో ప్రత్యర్ధికి వంద ఓట్లకు మించి రావొద్దని అన్నారు. జానకి గతంలో స్వల్ప ఓట్లతో ఓడిపోయిందని, ఆమె భర్త గుమ్మల మోహన్ రెడ్డి పార్టీ కోసం రేయింబవళ్లు శ్రమించారని, నేను భువనగిరి ఎంపీగా ఉన్నప్పుడు నల్లగొండ ఆఫీసులోనే ఉంటూ జనాల బాగోగులు చూసుకున్నాడని అన్నారు. గత 40 ఏళ్ల నుంచి శ్రీధర్ రెడ్డి నావెన్నంటే ఉంటున్నాడని, ఈ ఎన్నికల్లో ఈ ముగ్గురిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ ఎన్నికలు రాష్ట్రంలో చరిత్ర సృష్టిస్తాయని, కేంద్రం నుంచి నేరుగా నిధులు తెచ్చుకునే వెసులుబాటు లభిస్తదని అన్నారు. చైతన్య మేయర్ కాగానే మొదట ఇదే వార్డులో పనులకు శంకుస్థాపన చేస్తానని హామీ ఇచ్చారు. ఆమె కోరిక మేరకు హైటెన్షన్ లైన్ చేంజ్ చేస్తానని, కమ్యూనిటీ హాల్స్ నిర్మిస్తానని, బండారు గార్డెన్ రోడ్డు వెడల్పు చేస్తానని, వెంకటేశ్వర స్వామి గుడి చూట్టు ఉన్న డ్రైనేజీని అండర్ గ్రౌండ్ డ్రైనీజీగా మారుస్తానని మంత్రి కోమటిరెడ్డి హామీ ఇచ్చారు.