- మిర్యాలగూడలో జాడలేని ప్రజా పాలన
- రెండేళ్లలో నయాపైసా విడుదల చేయని సర్కార్
- వార్డుల్లో పేరుకుపోయిన డ్రైనేజీ, తాగునీటి సమస్యలు
- ముగ్గురు హేమాహేమీ ప్రజాప్రతినిధులు ఉన్నా శూన్యం
- సీఎం చెప్పిన రూ.295 కోట్ల లెక్కచెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్
- ఎమ్మెల్యే కోరిన కోరికలన్నీ కాగితాల పైనే
మిర్యాలగూడెం, ఏపీబీ న్యూస్: మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అగ్ని పరీక్ష ఎదుర్కోంటోంది. పార్టీలో నెలకొన్న గ్రూపు పంచాయితీలు ఓవైపు, మరో వైపు పట్టణంలో పేరుకుపోయిన సమస్యలు ఎన్నికల్లో సవాల్‌గా మారాయి. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుస్తున్న అభ్యర్థులకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమువుతోంది. 48 వార్డుల్లో చాలా వరకు కొత్త అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారు. దీంతో వార్డుల్లో సమస్యల పట్ల అవగాహన లేని అభ్యర్థులకు ఏం బదులు చెప్పాలో కూడా అర్ధం కావడం లేదు. చైర్మన్ అభ్యర్థి వేణుగోపాల్ రెడ్డి భార్య నూకల కవిత సహా ఇతర అభ్యర్థులు గత రెండేళ్లలో చేసిన అభివృద్ధి గురించి జనాలకు వివరించలేకపోతున్నారు. సీఎం రేవంత్ సభలో గత రెండేళ్లలో మిర్యాలగూడకు రూ.295 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. కానీ ఆ పనులన్నీ ఎక్కడ జరిగాయో కూడా పట్టణ ప్రజలకు పాలు పోవడం లేదు. వార్డుల్లో ఎక్కడ చూసిన డ్రైనేజీ సమస్య, ఇరుకు వీధులు, తాగునీటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ముగ్గురు నేతలు ఉన్నా శూన్యమేనా..?
సీఎం సభలో మిర్యాలగూడలో బలమైన నాయకత్వం పనిచేస్తోందని గొప్పలు చెప్పారు. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ఎమ్మెల్యే, ఎంపీ రఘువీర్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఇలా మూడు కీలకమైన పదవులు కలిగిన ప్రజాప్రతినిధులు ఉండటం మిర్యాలగూడ అదృష్ట మని అన్నారు. కానీ అభివృద్ధి మాత్రం అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. పక్కన ఉన్న నల్లగొండ మున్సిపాలిటీలో మంత్రి కోమటిరెడ్డి రెండు వేల కోట్ల అభివృద్ధి పనుల చేస్తుండగా, మరోవైపు మంత్రి ఉత్తమ్ హుజూర్నగర్, కోదాడలో వేల కోట్ల పనులు చేపడతున్నామని ఎన్నికల్లో గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ మిర్యాలగూడెంలో మాత్రం సీఎం అత్యంత సన్నిహితుడైన ఎంపీ రఘువీర్, జానారెడ్డి శిష్యుడు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఉన్నప్పటికీ నిధులు తేవడంలో మాత్రం విఫలమయ్యారు. గ్రూపు రాజకీయాలను పెంచిపోషిస్తున్న ఈ ముగ్గురు పట్టణాభివృద్ధిలో మాత్రం రాణించలేకపోతున్నారు. ఎమ్మెల్యేను ప్రజల్లో జీరోగా చూపించేందుకు ఈ ఇద్దరు తెరవెనక కుట్రపన్నుతున్నారనే ప్రచారం జోరుగా నడుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించిన రఘువీర్, శంకర్ నాయక్‌ను ఎంపీ, ఎమ్మెల్సీగా చేశారు. అయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో మిర్యాలగూడ నియోజకవర్గాన్ని తమవశం చేసుకోవాలంటే ఎమ్మెల్యేను జనాల్లో చులకన చేయాలనే ఉద్దేశంతో రాజకీయ ఆధిపత్యం కోసం మిర్యాలగూడ పట్టణాన్ని అభివృద్ధి చేయకుండా పడావుగా పెట్టారు. ఎంపీ, ఎమ్మెల్సీ కోటా నిధులు ఎక్కడ కేటాయిస్తున్నారో కూడా అంతుచిక్కడం లేదు. ఎమ్మెల్యే సీడీఎఫ్ గ్రాంట్స్ ప్రభుత్వం విడదల చేయడమే బంద్ చేసింది. సీఎంను ఒప్పించి తమ మున్సి పాలీటీలకు వేల కోట్ల నిధులు తెచ్చుకుంటున్న మంత్రులు, ఆసియాలో మిర్యాలగూడ రైస్ బౌల్ అని చెప్పిన సీఎంకు గూడెం అభివృద్ధి చేయాలనే కోరిక ఎందుకు కలగడం లేదని ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు నిలదీస్తున్నారు.
ఎమ్మెల్యే హామీలు పట్టించుకోని సీఎం
మిర్యాలగూడంలో ఇంటిపోరును చక్కబెట్టుకోవడం ఎమ్మెల్యేలకు చేతకాలేదని నిరూపించేందుకే పార్టీలో జరుగుతున్న గొడవలను వాళ్లు సీరియస్‌గా తీసుకోలేదు. చివరకు ఎమ్మెల్యే పట్టణాభివృద్ధి కొరకు చేపట్టాల్సిన పనుల గురించి సీఎం హామీ ఇవ్వకపోవడం కూడా రాజకీయ కోణంగానే చూస్తున్నారు. ఎన్నికల కోడ్ అడ్డంగా ఉందని సీఎం హామీల పైన స్పష్టత ఇవ్వలేదని కాంగ్రెస్ లీడర్లు చెప్తు న్నా, రెండేళ్లలో అనేక సార్లు సీఎంను, జిల్లా మంత్రులను కలిసిన ఎమ్మెల్యే ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకపోవడం విడ్డూరంగా ఉంది.

ఈ సమస్యలు తీరేదెన్నడూ?
మిర్యాలగూడ మున్సిపాలిటీని అప్‌గ్రేడ్ చేయాలని, ఆర్టీసీ బస్టాండ్ ను డిజిటల్ బస్టాండ్‌గా ఆధునీకరించాలని, మైనార్టీలకు ప్రత్యేకంగా విద్యాసంస్థలు, నర్సింగ్ కాలేజీ, ఐటీఐ, రాంనగర్ డంపింగ్ యార్డు తరలించాలని, ఏరియా ఆసుపత్రిలో సీటీ స్కాన్, ట్రామా సెంటర్ యూనిట్, పెద్ద చెరువు, చిన్న చెరువుల అభివృద్ధి, వాకింగ్ ట్రాక్, మైనార్టీలకు షాదీఖానా, వడ్డెర కులస్తులకు, క్రిస్టియన్లకు ప్రత్యేక శశ్మాన వాటికలు, రవీంద్ర నగర్‌ను ఇండ్రస్ట్రియల్ జోన్ నుంచి తొలగించడం, మున్సిపల్ మార్కెట్ నిర్మాణం, అద్దంకి-నార్కట్‌పల్లి ప్రధాన రహాదారి పక్కన సర్వీసు రోడ్డు, డ్రైనేజీ, దామరచర్లలో 50 పడకల ఆసుపత్రి, మీనాక్షి దేవాలయానికి ప్రత్యేక నిధులు, అడవిదేవుపల్లి లో బౌద్దదేవాలయం అభివృద్ధి, ప్రభుత్వ ఆఫీసులకు సొంత భవనా లు, సీసీరోడ్లు, డ్రైనేజీలు, ఇందిరమ్మ ఇళ్లు, పట్టణంలో రోడ్ల వెడ లప్పు నిధులు, అవంతీపురం వద్ద మున్నూరుకాపు, ముదిరాజ్ లకు కల్యాణ వేధికలు, మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు. ఈ సమస్య లన్నీ రెండేళ్ల నుంచి పరిష్కరించని ముగ్గురు నేతలు, ఎన్నికల్లో గె లిపిస్తే అభివృద్ధి చేస్తామని చెప్తున్న హామీల పట్ల ప్రజలకు నమ్మ కం కలగడం లేదు.