Municipal Elections: అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్న మున్సిపోల్స్​… ప్రచారానికి ముఖ్యనేతలు

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల తరపున ప్రచారం చేసేందుకు హేమాహేమీ నేతలు తరలి రానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మిర్యాలగూడలో నిర్వహించిన సభతో కాంగ్రెస్లో ఉత్సాహాం నెలకొంది. 18మున్సిపాలిటీల పైన తనకు రద్దీ లేదని, కచ్చితంగా గెలుస్తారనే నమ్మకం ఉందని మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డిలకు గెలుపు బాధ్యతలు అప్పగించారు. గత రెండు రోజుల నుంచి మంత్రి కోమటిరె డ్డి నల్లగొండలో అభ్యర్థుల తరపున రోడ్షోలు నిర్వహిస్తున్నా రు. 45 వార్డులు కైవసం చేసుకోవాలని లక్ష్యంతో గెలుపు బాధ్యతలను భుజానకెత్తుకున్నారు. సూర్యాపేట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్నగర్, నేరేడుచర్ల లో పార్టీ అభ్యర్థులతో ఎన్నికల సమావేశాల్లో పాల్గొంటున్నారు. అభివృద్ధిని చూసి ఓటెయ్యాలని కోరుతున్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి సూర్యాపేటలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడమే గాక, పార్టీలో చేరికలను ప్రోత్సహిస్తున్నారు. బుధవారం నల్లగొండలో ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు.

బీజేపీ, జనసేనా అభ్యర్థులకు మద్ధతుగా త్వరలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ నెల 8న నల్లగొండలో పర్యటించనున్నారు. ఇంకోవైపు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు తమ పరిధిలోని మున్సిపాలిటీల్లో అభ్యర్థుల పక్షాన ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. మెజార్టీ స్థానాలు గెలిపించేందుకు ఎమ్మెల్యే సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేతను తమ వైపు తిప్పుకునేందుకు బీఆర్ఎస్ మాజీలు ఆలేరు, నల్లగొండ, నకిరేకల్, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో ప్రచార వేగాన్ని పెంచారు.

Share
Share