Municipal Elections: పురపోరులో 1617 మంది అభ్యర్థులు.. కాంగ్రెస్​, సీపీఐ పొత్తు, బీఆర్​ఎస్​, సీపీఎం, జనసేన పొత్తు

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఉమ్మడి జిల్లాలోని 17 మున్సిపాలిటీలు, నల్గొండ కార్పోరేషన్లో మొత్తం 1617 మంది అభ్యర్థులు పోటీ చేయనున్నారు. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిశాక పార్టీల వారీగా అభ్యర్థుల తుది జాబితా అధికారులు ప్రకటించారు. 407 వార్డులకు 3,209 మంది నామినేషన్లు వేయగా, 1592 మంది విత్డ్రా అయ్యారు. 407 వార్డుల్లో కాంగ్రెస్ 394, బీఆర్ఎస్ 372, బీజేపీ 338, సీపీఎం 27, సీపీఐ 5, జనసేన 43 వార్డుల్లో పోటీ చేస్తోంది.

327 మంది స్వతంత్రులు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్, సీపీఐ కలిసి పోటీ చేస్తుండగా, బీఆర్ఎస్, సీపీఎం, జనసేన, కలిసి పోటీ చేస్తున్నాయి. బీజేపీ ఒంటిరిగానే బరిలో దిగింది. దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీలన్నీ బరిలో నిలిచాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో నేటి నుంచి అభ్యర్థుల ప్రచారం ఊపందుకోనుంది. బుధవారం మిర్యాలగూడలో సీఎం రేవంత్ రెడ్డి సభతో జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు హీటెక్కనున్నాయి.

జిల్లా పేరువార్డులుఅభ్యర్థులు
సూర్యాపేట141615
నల్గొండ162649
యాదాద్రి104353
మొత్తం4071617
పార్టీపేరువార్డులు
కాంగ్రెస్394
బీఆర్ఎస్372
బీజేపీ338
జనసేన43
సీపీఎం27
సీపీఐ05
జిల్లాపేరుకాంగ్రెస్బీఆర్ఎస్బీజేపీసీపీఎంసీపీఐజనసేన
నల్లగొండ158152131100112
సూర్యాపేట137130115090226
యాదాద్రి999092080205
Share
Share