నల్లగొండ, ఏపీబీ న్యూస్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా భారత రాష్ట్ర సమితి (BRS) అడుగులు వేస్తోంది. బుధవారం నాడు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మరియు జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి సంయుక్తంగా 18 మంది కార్పొరేటర్ అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేశారు.
సామాజిక సమీకరణాలకు పెద్దపీట
తొలి జాబితాలో మహిళలకు మరియు వివిధ సామాజిక వర్గాలకు బీఆర్ఎస్ ప్రాధాన్యత ఇచ్చింది. ఇందులో 20వ డివిజన్ను మిత్రపక్షమైన సీపీఎం (CPM) కు కేటాయించడం విశేషం.
బీఆర్ఎస్ అభ్యర్థుల వివరాలు ఇవే:
- 3వ డివిజన్: పేర్ల మల్లేశ్వరి అశోక్ (ఎస్సీ ఉమెన్)
- 7వ డివిజన్: మారగోని భవాని గణేష్ (జనరల్ ఉమెన్)
- 9వ డివిజన్: బాణావతి దీప్లా నాయక్ (ఎస్టీ జనరల్)
- 11వ డివిజన్: దండంపల్లి సుజాత సత్తయ్య (జనరల్ ఉమెన్)
- 13వ డివిజన్: గుండ్రెడ్డి రాధిక యుగంధర్ రెడ్డి (జనరల్ ఉమెన్)
- 15వ డివిజన్: దొడ్డి రమేష్ (ఎస్సీ జనరల్)
- 16వ డివిజన్: ఏర్పుల తర్షణ రవి (ఎస్సీ ఉమెన్)
- 17వ డివిజన్: మందడి లిఖిత సైదిరెడ్డి (జనరల్ ఉమెన్)
- 20వ డివిజన్: సీపీఎం (CPM)
- 21వ డివిజన్: అఫ్జల్ ఖాన్ (జనరల్)
- 25వ డివిజన్: మాతంగి ఉమాదేవి (జనరల్ ఉమెన్)
- 26వ డివిజన్: నాజ్మీన్ (బీసీ ఉమెన్)
- 27వ డివిజన్: షమీనా సుల్తానా (బీసీ ఉమెన్)
- 31వ డివిజన్: మిరియాల జ్యోతి స్వామి (జనరల్ ఉమెన్)
- 38వ డివిజన్: అల్లి గౌతమి శివశంకర్ (బీసీ ఉమెన్)
- 39వ డివిజన్: అల్లి వేణు యాదవ్ (బీసీ జనరల్)
- 42వ డివిజన్: ఎం. అనురాధ నాగరాజు (జనరల్ ఉమెన్)
- 47వ డివిజన్: సింగం లక్ష్మీ రామ్మోహన్ (జనరల్ ఉమెన్)
గెలుపే లక్ష్యంగా కార్యచరణ
అభ్యర్థుల ప్రకటన అనంతరం నేతలు మాట్లాడుతూ.. నల్లగొండ పట్టణ అభివృద్ధి బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందని, ప్రజలు మరోసారి కారు గుర్తుకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. మిగిలిన డివిజన్ల అభ్యర్థులను కూడా త్వరలోనే ప్రకటిస్తామని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.